రవితేజ రెమ్యునరేషన్.. 50% డిస్కౌంట్!

Published : Jan 30, 2019, 03:26 PM IST
రవితేజ రెమ్యునరేషన్.. 50% డిస్కౌంట్!

సారాంశం

వరుస ఫ్లాపులతో డీలా పడ్డ రవితేజ ఇప్పుడు మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. గతేదాడిలో వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలు అందుకున్న రవితేజతో సినిమా చేయడానికి దర్శకుడు విఐ ఆనంద్ ముందుకొచ్చాడు.

వరుస ఫ్లాపులతో డీలా పడ్డ రవితేజ ఇప్పుడు మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. గతేదాడిలో వరుసగా మూడు డిజాస్టర్ సినిమాలు అందుకున్న రవితేజతో సినిమా చేయడానికి దర్శకుడు విఐ ఆనంద్ ముందుకొచ్చాడు.

'డిస్కోరాజా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాకి రవితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే విషయంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా కోసం దాదాపు రూ.10 కోట్లను రెమ్యునరేషన్ గా తీసుకున్న రవితేజ ఇప్పుడు సగానికి సగం రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం. దానికి కారణం నిర్మాత రామ్ తాళ్లూరి అని తెలుస్తోంది. గతంలో రవితేజ నటించిన 'నేల టికెట్టు' సినిమాను నిర్మించిన ఇతడే. ఆ సమయంలోనే రవితేజ మీతో మరో సినిమా చేస్తానని నిర్మాతకు మాటిచ్చాడట.

దాని ప్రకారమే ఇప్పుడు సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా అని రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేయలేడు కదా.. అందుకే తన రెమ్యునరేషన్ లో సగానికి సగం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ ఈ ఒక్క సినిమా కోసమా..? లేక ఇదే కంటిన్యూ చేస్తాడా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది!

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?