రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి!

Published : Jan 30, 2019, 03:08 PM IST
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి!

సారాంశం

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆగ్రాలో ఓ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు శివానీ తన భర్త నిఖిల్ తో కలిసి కారులో బయల్దేరారు. 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆగ్రాలో ఓ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు శివానీ తన భర్త నిఖిల్ తో కలిసి కారులో బయల్దేరారు. 

యూపీలో మధుర జిల్లాలో యమునా ఎక్స్ ప్రెస్ హైవే దగ్గర శివానీ భర్త ఓ కారును ఓవర్ టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో వీరి కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో శివానీ కూర్చున్న వైపు మొత్తం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే శివానీ, నిఖిల్ లను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుండి మధురలోని నియాస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివానీ కన్నుమూసింది. 

ఆమె భర్తకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బీహార్ కి చెందిన శివానీ పాప్ సింగర్ పేరు తెచ్చుకుంది. చాలా చోట్ల స్టేజ్ షోలు కూడా ఇచ్చింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?