శ్రీలీల విషయంలో రవితేజ రియలైజ్ అయ్యాడా?

Published : Apr 10, 2023, 03:21 PM IST
  శ్రీలీల విషయంలో రవితేజ రియలైజ్ అయ్యాడా?

సారాంశం

ప్రస్తుతం శ్రీలల... మహేష్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, బాలకృష్ణ ఇలా దాదాపు స్టార్స్  అందరి సినిమాలు చేస్తోంది. 

గతేడాది రవితేజ 'ధమాకా' సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన మాస్ మహారాజా రవితేజ... ఈ ఏడాది ఓపెనింగ్ కూడా హిట్టు తోనే మొదలెట్టాడు. బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించి మంచి మార్కులే కొట్టేసిన సంగతి తెలిసిందే. చివరి రెండు చిత్రాలు మంచి హిట్లుగా నిలవగా.. తాజాగా రిలీజైన రావణాసుర చిత్రం ప్లాఫ్ టాక్ మూట కట్టుకుంది. ఈ నేపధ్యంలో ధమాకా లో శ్రీలీల విషయం హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికిడి  ధమాకా సినిమా అంత పెద్ద హిట్టవడానికి కారణం అందులోనే పాటలు. అలాగే శ్రీలీల కూడా. తన అందం అభినయంతో అధ్భుతంగా నటించి సినిమా హిట్టయ్యేందుకు చాలా కష్టపడిందనేది అందరూ ఒప్పుకునే విషయం. రావణాసుర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు ఉండగా... శ్రీలీల రేంజ్ హీరోయిన్ లేదని మీడియాలో  అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. శ్రీలీల ఉండటం వల్లనే ధమాకా హిట్టైందని, లేకపోతే ఆ సినిమా రావణాసుర లా మారేదని అంటున్నారు.  ‘రావణాసుర’ సరిగా ఓపెనింగ్ తెచ్చుకోకపోవడం వల్ల శ్రీలీలకి క్రేజ్ పెరగడం  చెప్పుకోదగ్గ విషయం. దీంతో ఆమెకి జనంలో బాగా క్రేజ్ ఉందని అర్థమవుతోందని తేల్చేస్తున్నారు.

రవితేజ కూడా ఈ విషయం రియలైజ్ అయ్యాడని, తన తదుపరి సినిమాల్లో శ్రీలీల ను తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు టాక్ మొదలైంది.ప్రస్తుతం శ్రీలల... మహేష్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, బాలకృష్ణ ఇలా దాదాపు స్టార్స్  అందరి సినిమాలు చేస్తోంది.  శ్రీలీల ఎనర్జీ తో కూడిన డ్యాన్స్ లు. పాటలు తమ సినిమాకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. 

 ఈ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ రావణాసుర విలన్ పాత్రలో రావు రమేశ్ మురళీ శర్మ సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్