
ఇటీవల కాలంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బాగా వార్తల్లో నిలుస్తున్న హీరో. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సింగిల్‌గా వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. `ఎస్‌ఆర్ కళ్యాణమండపం` చిత్ర సక్సెస్‌తో టాలీవుడ్‌లో సెటిల్ అయ్యాడు. ఈ సినిమాతో ఆయనకు వరుసగా ఆఫర్లు క్యూ కొట్టాయి. అంతకు ముందే `రాజావారు రాణిగారు` చిత్రంతో ఆకట్టుకున్నాడు. కానీ `ఎస్‌ఆర్ కళ్యాణమండపం` చిత్రం హీరోగా ఆయన కెరీర్‌ని మలుపుతిప్పిందని చెప్పాలి. ఈ సినిమా అనంతరం వరుసగా నాలుగైదు చిత్రాలకు సైన్ చేశాడు కిరణ్. ఆ సక్సెస్ తో వచ్చే క్రేజ్, ఇమేజ్‌లో ఆయన ఇరుక్కుపోయాడు.
ఆ తర్వాత కిరణ్ నుంచి వరుసగా `సెబాస్టియన్ పీసీ524`, `సమ్మతమే`, `నేను మీకు బాగా కావాల్సిన వాడిని`, `వినరో భాగ్యము విష్ణు కథ`, ఇటీవల `మీటర్` చిత్రాలతో వచ్చాడు. మూడేళ్లలో ఆరు సినిమా చేశాడు. గతేడాదే ఆయన్నుంచి మూడు సినిమాలు రావడం విశేషం. ఇందులో `వినరో భాగ్యము విష్ణుకథ` చిత్రం ఒక్కటే అంతో ఇంతో ఆడింది. అది కూడా బలవంతంగానే ఆడిందని చెప్పొచ్చు. ఇటీవల వచ్చిన `మీటర్` సినిమా మాత్రం మరీ దారుణంగా ఉంది. ఫస్ట్ షోతోనే డిజాస్టర్ టాక్‌ని తెచ్చుకుంది.
గత రెండు మూడు సినిమాలుగా కిరణ్ అబ్బవరం చెప్పిన మాట మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్రయత్నమని, కమర్షియల్ సినిమాలతో మెప్పించాలని తాను తాపత్రయపడుతున్నట్టు చెప్పారు. ఆ దిశగానే తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్లు, ఎలివేషన్లి ప్రయారిటీ ఇచ్చారు. అంతేకాదు తాను ఒప్పుకున్న సినిమాలు దేనికదే డిఫరెంట్‌గా ఉండాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అయితే ఆయన ఆలోచన ప్రకారం జోనర్ వైజ్‌గా డిఫరెంట్ చూపించారు కానీ, కథల్లో కొత్తదనం చూపించలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. పైగా ఆయన చేసింది ఆల్మోస్ట్ అప్‌కమింగ్ డైరెక్టర్లతోనే, చాలా వరకు కొత్త దర్శకుడు కసితో, డిఫరెంట్ కథలతో వస్తారు, కానీ కిరణ్ చేసిన సినిమాలన్నీ రొటీన్‌గా, రొడ్డకొట్టుడు సినిమాల్లా ఉండటం అత్యంత విచారకరం.
నటుడిగా కిరణ్ అబ్బవరం మెప్పిస్తున్నాడు. సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతున్నాడు. సినిమాపై తనకున్న ప్యాషన్ కనిపిస్తుంది. కానీ ఎంచుకుంటున్న కథలే సరైనవి కావని, కథల ఎంపికలో పొరపాట్లు చేస్తున్నారని, సరైనా కథలు ఎంచుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. చాలా వరకు యంగ్ హీరోలకు అవకాశాలు రావడమే కష్టం, అంతటి ఇమేజ్ రావడం కష్టం. ఎంతో స్ట్రగుల్ అవుతుంటారు. కానీ కిరణ్‌కి దర్శక, నిర్మాతలు క్యూలో ఉంటున్నారు, బట్ తనే ఉపయోగించుకోలేకపోతున్నారు. సరైనా సినిమాలను పట్టు కోవడంలో విఫలమవుతున్నాడని తెలుస్తుంది. అయితే ఇవన్నీ కరోనాకి ముందు ఒప్పుకున్న కథలని, ఇప్పుడు రిలీజ్ అవడంతో ఔట్ డేటెడ్ సినిమాలుగా కనిపిస్తున్నాయని అంటున్నారు.
దీనికితోడు ప్రతి సినిమాలోనూ కిరణ్ తనలో తాను గునుగు కోవడం, డైలాగ్ డెలివరీ విషయంలోనూ కామెంట్లు వినిపించాయి. ఆ విషయంలో బెటర్ కావాల్సిందని, డైలాగుల్లో ఈజ్ కనిపించడం లేదంటున్నారు. మరోవైపు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో కిరణ్. ఇలాంటి టైమ్‌లో కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు, బలమైన కథ ఉన్న సినిమాలు చూసుకోవాలి. కానీ కిరణ్ మాత్రం మాస్ ఇమేజ్, మాస్ ఎలిమెంట్లు, ఎలివేషన్ సీన్ల చుట్టూ తిరుగుతూ, వాటికే ప్రయారిటీ ఇస్తున్నాడని సర్వత్రా సెటైర్లు పేలుతున్నాయి. పెద్ద హీరోలే బలమైన కథల వైపు అడుగులు వేస్తుంటే, కిరణ్ మాత్రం అందుకు భిన్నంగా రొటీన్ దారిలో వెళ్తూ మిగిలిన దారులపై సవారీ చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే హీరో కిరణ్‌కి యూత్ లో మంచి ఇమేజ్ ఏర్పడింది. తన ఫాలోవర్స్ పెరిగారు. అభిమానులు ఏర్పడ్డారు. తన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తుండటమే అందుకు కారణం. కానీ ఆయన రాంగ్ జడ్జ్ మెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. రొటీన్ సినిమాలు చేస్తూ ఉన్న ఇమేజ్ పోగొట్టుకుంటున్నారు. మొన్న వచ్చిన `మీటర్`తో దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ట్రోల్స్ కి కూడా గురయ్యాడు. చాలా మంది రాడ్ స్టార్ అంటున్నారు. కిరణ్ కథల ఎంపికలో రియలైజేషన్ కావాలంటున్నారు. లేదంటే కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుందని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇక నుంచైనా ఆ జాగ్రత్తలు తీసుకుని ఎదుగుతాడా అనేది చూడాలి.