Ravanasura OTT : ఓటీటీలోకి వచ్చిన ‘రావణసుర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

By Asianet News  |  First Published Apr 28, 2023, 1:26 PM IST

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) లేటెస్ట్ ఫిల్మ్ ‘రావణసుర’. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
 


మాస్ మహారాజా రవితేజ (RaviTeja) లేటెస్ట్ గా యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’తో థియేటర్లలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది చివర్లో ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. ఈ ఏడాది తన మాస్ పవర్ చూపించేందుకు ప్రయత్నించారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ Ravanasura చిత్రంలో నటించారు. ఏప్రిల్ 7న చిత్రం థియేటర్లలో విడుదలైంది.  మూవీలో రవితేజ మర్డర్స్ చేసే లాయర్ పాత్రలో అలరించారు. 

థియేటర్లలో సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కొంతమేర  ఆడియెన్స్ ను మెప్పించగలిగినా బాక్సాఫీస్ వద్ద కాస్తా వెనకబడింది. దీంతో సినిమా త్వరగా ఓటీటీలోకి వచ్చేసింది.  పదిరోజుల్లోనే చిత్రం థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. దీంతో ఓటీటీలో ప్రసారం అయ్యింది.  ఈరోజు నుంచి చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమోజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం డిజిటల్ హక్కులను దక్కించుకుంది.  దీంతో చిత్రాన్ని  సైలెంట్ గా ఓటీటీ రిలీజ్ చేశారు.

Latest Videos

చిత్ర ఓటీటీ  రైట్స్ కోసం రూ.12 కోట్ల వరకు వెచ్చించిందంట అమేజాన్. ఏదేమైన డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి చిత్రం  రావడంతో ఫ్యాన్స్ ఖుషీ  అవుతున్నారు. చిత్రంలో రవితేజ  నెగెటీవ్ షేడ్స్ లో చించేశారు. అప్పటికే ‘మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. రెస్పెక్ట్ మై ఆర్ట్ బేబీ’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ ఆసక్తిని పెంచాయి. 

దీంతో ఓటీటీలోనే సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ లాంటి అందాల భామలు నటించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక రవితేజ  ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వర్’ షూట్ లో బిజీగా ఉన్నారు. 

 


Now Streaming On pic.twitter.com/bQknxOF5wC

— Telugu Television News (@TeluguTvExpress)
click me!