‘క్రాక్’ వివాదంపై రవితేజ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?

By Surya Prakash  |  First Published Jan 15, 2021, 4:43 PM IST

రవితేజ నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, అయినప్పటికీ దీనికి థియేటర్లు తగ్గించి, డబ్బింగ్ సినిమా అయిన విజయ్ నటించిన ‘మాస్టర్’కు ఎక్కువ థియేటర్లు కేటాయించారని అన్నారు. దిల్ రాజు పేరును ‘కిల్ రాజు’గా మార్చాలని మండిపడ్డారు. సంక్రాంతి రోజున తెలుగు సినిమాలకు కాకుండా, తమిళ సినిమాలకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. 


గత రెండు రోజులుగా సినీ వర్గాల్లో, మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం... ‘క్రాక్’ వివాదం. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు, పంపిణీదారుడు వరంగల్ శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ కు మధ్య చోటు చేసుకున్న వివాదం అందరూ మాట్లాడుకుంటున్నారు. వరంగల్ శ్రీను అనే  డిస్ట్రిబ్యూటర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ దిల్ రాజు మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.నైజాంలో థియేటర్స్‌పై ఒక నియంత పాలన జరుగుతోందని విమర్శలు గుప్పించారు. దిల్‌రాజు, శిరీష్‌రెడ్డి నైజాంలో పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. 

మంచి రెస్పాన్స్  లభిస్తున్న క్రాక్ సినిమాను థియేటర్ల్ నుంచి తీసేస్తున్నారన్న శ్రీను ఏడాది క్రితమే తాను క్రాక్ సినిమా ప్రొడ్యూసర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు గుర్తు చేశారు. క్రాక్ సినిమా హిట్ అయినా థియేటర్స్ లాగేసుకుంటున్నారని ఆరోపించిన శ్రీను దిల్‌రాజు, శిరీష్‌రెడ్డి వల్ల ఇబ్బంది పడుతున్నందుకే మీడియా ముందుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
 
రవితేజ నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, అయినప్పటికీ దీనికి థియేటర్లు తగ్గించి, డబ్బింగ్ సినిమా అయిన విజయ్ నటించిన ‘మాస్టర్’కు ఎక్కువ థియేటర్లు కేటాయించారని అన్నారు. దిల్ రాజు పేరును ‘కిల్ రాజు’గా మార్చాలని మండిపడ్డారు. సంక్రాంతి రోజున తెలుగు సినిమాలకు కాకుండా, తమిళ సినిమాలకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. క్రాక్ సినిమాకు టాక్ బాగుందని, అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను థియేటర్ల నుంచి తీసేయడం తనను ఆవేదనకు గురిచేసిందని  డిస్ట్రిబ్యూటర్ శ్రీను అన్నారు.

Latest Videos

అయితే ఈ వివాదంలోకి రవితేజ మాత్రం తలపెట్టుదలుచుకోలేదని తెలుస్తోంది. గతంలో ఇలాంటి సమస్తే ..‘వాల్మీకి’ సినిమాకు వచ్చింది. ఆ సినిమాకు వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించినపుడు కూడా తనను తొక్కేయాలని చూశాడని.. దానికి పోటీగా డబ్బింగ్ సినిమా ‘బందోబస్త్’ను రిలీజ్ చేసి ‘వాల్మీకి’తో పోలిస్తే దానికి ఎక్కువ థియేటర్లు ఇచ్చాడని రాజుపై ఆరోపణలు గుప్పించాడు శ్రీను. అయితే అప్పుడు వరుణ్ తేజ, హరీష్ శంకర్ కలగచేసుకుని సెటిల్ చేసారని వినికిడి. 

అయితే ఇప్పుడు రవితేజ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. రవితేజకు, దిల్ రాజుకు ఉన్న అనుబంధం అలాంటిది. దిల్ రాజు నిర్మాతగా భధ్ర, రాజా ది గ్రేట్ సినిమాలు చేసారు రవితేజ. వారిద్దరి మధ్యా మంచి స్నేహం ఉంది. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని రవితేజ సైలెంట్ గా ఉన్నారంటున్నారు. కాకపోతే రవితేజ సీన్ లోకి వస్తే..ఖచ్చితంగా థియోటర్స్ సమస్య తీరుతుందని, తన సినిమా క్రాక్ నిమిత్రం రవితేజ ముందుకు రావాలని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. 
  
మరో ప్రక్క తాను ఎంతో మర్యాదగా దిల్ రాజు గారు అంటుంటే.. బీటెక్ చేసిన తనను ఏరా పోరా అని సంబోధించాడని.. ఈ రోజు నుంచి తన లక్ష్యం డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ కాదని.. దిల్ రాజు, శిరీష్ రెడ్డిలే తన టార్గెట్ అని.. త్వరలోనే ఆయన ఆధిపత్యానికి తెరపడబోతోందని శ్రీను హెచ్చరించిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 
 

click me!