పాటల చిత్రీకరణలో మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" చిత్రం

Published : Apr 06, 2018, 01:58 PM IST
పాటల చిత్రీకరణలో మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" చిత్రం

సారాంశం

పాటల చిత్రీకరణలో మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" చిత్రం

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా  క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ఎంటర్టైనర్‌గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న“నేల టిక్కెట్టు” సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ నృత్య దర్శకుడు రాజ సుందరం నేతృత్వంలో గండిపేటలోని భారతదేశ మొట్టమొదటి స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో మూడు రోజులుగా జరుగుతుంది. షూటింగ్ వేగంగా పూర్తి చేసి మే 24న విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు.

 

రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి,అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కేప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా