రవితేజకు మాస్ మహారాజ్ ట్యాగ్ ఎవరు ఇచ్చారో తెలుసా..? అసలు సీక్రెట్ విప్పిన హరీష్ శంకర్..?

By Mahesh Jujjuri  |  First Published Oct 17, 2023, 8:36 AM IST

హీరోలు మాస్ ఇమేజ్ సాధించడం అంత సులువైన పని కాదు.. అందులోను.. మాస్ లో ఊరమాస్ ఇమేజ్ వచ్చిందంటే.. ఆ హీరో కెరీర్ కు తిరుగు లేదు అనే చెప్పాలి. ఆ ఇమేజ్ ప్రస్తుతం రవితేజకు ఉంది. మరి ఆయన మాస్ మహారాజ్ కిరీటం ఎవరు పెట్టారు. అసలు విషయం వెల్లడించాడు డైరెక్టర్ హరీష్ శంకర్.


హీరోలు మాస్ ఇమేజ్ సాధించడం అంత సులువైన పని కాదు.. అందులోను.. మాస్ లో ఊరమాస్ ఇమేజ్ వచ్చిందంటే.. ఆ హీరో కెరీర్ కు తిరుగు లేదు అనే చెప్పాలి. ఆ ఇమేజ్ ప్రస్తుతం రవితేజకు ఉంది. మరి ఆయన మాస్ మహారాజ్ కిరీటం ఎవరు పెట్టారు. అసలు విషయం వెల్లడించాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

టాలీవుడ్ హీరోలలో రవితేజ చాలా స్పెషల్ ఆయన జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరోగా ఎదిగాడు. హీరో అంటే మామూలు హీరో కాదు.. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నా..మాస్ ఇమేజ్ మాత్రం ఈయన చుట్టే తిరుగుతుంది. మాస్ హీరోలకే మహారాజుగా వెలుగు వెలుగుతున్నాడు రవితేజ. 50 ఏళ్లు దాటాయి.. 60కి దగ్గరలో ఉన్నాడు. అయినా ఆ జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మాస్ ప్రేక్షకులను అలరించడానికి.. ఇడియట్ టైమ్ లో ఎంత హుషారుగా ఉన్నాడో.. ప్రస్తుతం కూడా అంతే హుషారు చూపిస్తున్నాడు రవితేజ. 

Latest Videos

మరి ఇంత మాస్ ఇమేజ్ సపాదించుకున్న రవితేజకు.. మాస్ మహారాజ్ బిరుదు ఎవరు ఇచ్చారు. రవితేజ పేరు పలకాలన్నా.. రాయాలన్నా.. మాస్ మహారాజ్ అనేది రాయకుండా ఉండలేము. అంతలా అలవాటు అయిన ఈ పేరు ఆయనకు ఎవరు ఇచ్చారు. ఈ విషయాన్ని తాజాగా టైగర్ నాగేశ్వారరావు వేడుకల్లో.. అసలు సీక్రేట్ ను విప్పారు దర్శకుడు హరీష్ శంకర్. మాస్ మహారాజ్ ట్యాగ్ పై ఆయన ఏమన్నారంటే..? 

ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు బిజీలో ఉన్నాడు రవితేజ. ఈమూవీతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు ఈ సినిమాతో వెళ్ళబోతున్నాడు. ఇప్పటికే ప్రమోషన్ల హడావిడి కూడా అయిపోవస్తోంది. ఈ నెల 20న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈసందర్భంగా ఇటు సౌత్ తో పాటు.. నార్త్ లో కూడా ప్రచారం కంప్లీట్ చేసుకున్నాడు మాస్ మహారాజ్.  ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో మాట్టాడిన దర్శకుడు హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. 

రవితేజని మాస్ మహారాజా అని పిలుస్తారు. ఈ ట్యాగ్ లైన్ వెనుక వున్న ఫ్లాష్ బ్యాక్ చెప్పారు హరీష్. లక్ష్యం సినిమా ఆడియో వేడుక కి జరుగుతున్న సమయంలో అదే వేడుకలో యాంకర్ సుమ గారితో పాటు నేనూ వేదికపై వున్నాను. అందరి హీరోలని ఏవో ట్యాగ్ లైన్ తో పిలుస్తున్నారు. రవితేజ గారి వంతు వచ్చింది. కాస్త అలోచించి మాస్ మహారాజా అని పిలవమని సుమ గారితో చెప్పాను. అది ప్రేక్షకులకు బాగా నచ్చింది. రవితేజ గారికి సరిగ్గా సరిపోయింది. రవితేజ నాకు లైఫ్ ఇచ్చారు. ఆయనకి నేను ఓ ట్యాగ్ ఇవ్వడం, అది ఆడియన్స్ కి నచ్చడం ఆనందంగా వుంది అని మాస్ మహారాజా ముచ్చటని గుర్తు చేసుకున్నారు హరీష్ శంకర్.

మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ టైగర్‌ నాగేశ్వరరావు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌  హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో.. పవన్ కళ్యాన్ మాజీ భార్య  రేణు దేశాయ్‌ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈసినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో పాటు..  అనుకృతి కీలక పాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వం వహించగా.. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

 

click me!