బలుపు దర్శకుడితో మాస్ రాజా న్యూ ప్రాజెక్ట్!

Published : May 26, 2019, 01:02 PM IST
బలుపు దర్శకుడితో మాస్ రాజా న్యూ ప్రాజెక్ట్!

సారాంశం

  మాస్ మహారాజ రవి తేజ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ విషయంపై దర్శకుడు గోపీచంద్ తిరుమలలో క్లారిటీ ఇచ్చేశాడు.

మాస్ మహారాజ రవి తేజ - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ విషయంపై దర్శకుడు గోపీచంద్ తిరుమలలో క్లారిటీ ఇచ్చేశాడు. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు దర్శకుడు మాస్ రాజాతో వర్క్ చేస్తున్నట్లు చెప్పాడు. 

డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ గోపీచంద్ ఆ తరువాత రవితేజతో బలుపు అనే సినిమా చేశాడు. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వడంతో గోపి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పండగ చేస్కో - విన్నర్ సినిమాలు ఈ దర్శకుడిని కాస్త దెబ్బేశాయి. 

తనకు ఎప్పటినుంచో పరిచయమున్న మాస్ రాజాతో ఎట్టకేలకు ఒక సినిమా చేయడానికి ముహూర్తం సెట్ చేసుకున్నాడు. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని దర్శకుడు వివరణ ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Anasuya: జబర్దస్త్ లో జరిగినదానికి నాకు సంబంధం లేదు అంటూ అనసూయ ట్విస్ట్.. హద్దులు దాటిన మాట వాస్తవమే కానీ
Chiru Vs Anil: 2027 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ అనిల్ రావిపూడి.. లిస్ట్ లో 6 సినిమాలు, మజా గ్యారెంటీ