#Eagle రవితేజ ‘ఈగల్’ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ లెక్కలు

Published : Feb 09, 2024, 07:03 AM IST
#Eagle రవితేజ ‘ఈగల్’ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ లెక్కలు

సారాంశం

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంపై ఉన్న అంచనాలతో రవితేజ సినిమాకి బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 


రవితేజ కెరీర్ లో 73వ సినిమాగా రాబోతున్న చిత్రం ‘ఈగల్’. కార్తికేయ 2 తో పాటు రవితేజ సినిమాలు ధమాకా, డిస్కో రాజా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్.. దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  ఈ మూవీ ఈ  నేడు (పిబ్రవరి 9) రిలీజ్ అవుతోంది. ఇప్పటికే యుఎస్ ప్రీమియర్స్ నుంచి హిట్ టాక్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది అనేది చూద్దాం. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంపై ఉన్న అంచనాలతో రవితేజ సినిమాకి బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 
 
రవితేజ ఈగల్ వరల్డ్ వైడ్ ప్రీ  రిలీజ్ బిజినెస్

👉Nizam: 6Cr

👉Ceeded: 2.5Cr

👉Andhra: 8.5Cr

AP-TG Total:- 17CR

👉KA+ROI: 2Cr

👉OS – 2Cr

Total WW: 21CR(BREAK EVEN – 22CR~)

  
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.  ఈగల్‌లో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.  విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ ట్రైలర్‌లో మాస్‌ మహారాజా రవితేజ స్టైల్‌లో సాగుతున్న మార్క్‌ డైలాగ్స్‌ అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు