Dhamaka: కొత్త అవతారంలో మాస్ మహారాజ్, ఏ పాత్ర చేయబోతున్నాడంటే..?

Published : Feb 15, 2022, 06:56 PM ISTUpdated : Feb 15, 2022, 06:57 PM IST
Dhamaka: కొత్త అవతారంలో మాస్ మహారాజ్, ఏ పాత్ర చేయబోతున్నాడంటే..?

సారాంశం

ఖిలాడీతో పర్వాలేదు అనిపించుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja). ఇక నెక్ట్స్ సినిమాలపై గట్టిగా ఫోకస్ చేశాడు. గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేసుకుంటున్నాడు.

ఖిలాడీతో పర్వాలేదు అనిపించుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja). ఇక నెక్ట్స్ సినిమాలపై గట్టిగా ఫోకస్ చేశాడు. గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేసుకుంటున్నాడు.

ఈ ఏడాదిలో  ఖిలాడి(Khiladi) సినిమాతో పర్వాలేదు అనిపించాడు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja)  ఆ తరువాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాను సెట్స్ ఎక్కించాడు. ఈ సినిమాను త్వరలోనే  థియేటర్లకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పరుగులు పెట్టింది. రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుగా రవితేజ(Ravi Teja) ధమాకా సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తిచేసుకుంది.


అయితే ఈ సినిమాలో రవితేజ(Ravi Teja) ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిసింది. ఇందులో ఒక పాత్రలో ఆయన లెక్చరర్ గా కనిపిస్తాడని సమాచారం. ఆయన ప్రేమలో పడే స్టూడెంట్ గా పెళ్ళి సందడి ఫేమ్ శ్రీలీల(Sri Leela) కనిపిస్తుందని టాలీవుడ్ టాక్. లెక్చరర్ కీ .. స్టూడెంట్ కి మధ్య లవ్ బ్యాక్ డ్రాప్ లో ఈమూవీ  సాగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ  నేపథ్యంలో గతంలోనే కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే వాటికంటే డిఫరెంట్ గా ఈమూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.


మాస్ అభిమానులకు నచ్చేలా.. రవితేజ(Ravi Teja) మార్కును మిస్ అవ్వనీయకుండా.. కొత్తదనం కూడా చేర్చి సినిమాను తెరకెక్కించబోతున్న్టటు సమాచారం.  ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉంటుందని చెబుతున్నారు.ఆ పాత్రకి ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. త్రీనాధ్ రావ్ నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ .. వివేక్ కూచిభొట్ల .. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి, భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే