ఇప్పుడు మరో హీరో రవితేజ సైతం..ఇదే తరహా లాయిర్ పాత్రలో కనిపించబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరు...బ్యానర్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ...తన తాజా చిత్రం వకీల్ సాబ్ లో లాయిర్ కనిపిస్తున్నారు. హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ మూవీలో నటిస్తున్నాడు. పింక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రను పోషించాడు. అదే లాయర్ పాత్రను తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మరో హీరో రవితేజ సైతం..ఇదే తరహా లాయిర్ పాత్రలో కనిపించబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరు...బ్యానర్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే..
రవితేజను లాయిర్ గా చూపించబోయే దర్శకుడు మరెవరో కాదు మారుతి అని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘ప్రతిరోజు పండగే’ చిత్రం ద్వారా మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. దర్శకుడు మారుతి తన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్దపీట వేస్తుంటారు. అయితే రవితేజతో రూపొందించనున్న చిత్రంలో తన పంథాకు భిన్నంగా సోషల్ మెసేజ్ ఉన్న కోర్ట్‌రూమ్ డ్రామా కథాంశాన్ని ఎంచుకున్నారని సమాచారం. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు.
ఇక సోషల్‌మెసేజ్ ఉన్న కథ అయ్యినప్పటికీ మారుతి తన సినిమాల్లో చూపించే ఫన్ ని ఏ మాత్రం మిస్ కారట. ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండబోతోందని తెలిసింది. రవితేజ కు ఈ స్క్రిప్టు తెగ నచ్చేసిందిట. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.