సెట్ నుండి నన్ను గెంటేశారు.. స్టార్ హీరో కామెంట్స్!

Published : Nov 01, 2018, 03:44 PM IST
సెట్ నుండి నన్ను గెంటేశారు.. స్టార్ హీరో కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న నటుడు రణవీర్ సింగ్ ని సినిమా సెట్ నుండి గెంటేశారని వెల్లడించాడు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు.. వివరాల్లోకి వెళితే.. ఓ టీవీ షోలో పాల్గొన్న రణవీర్ ''అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నటించిన ఓ సినిమా షూటింగ్ చూడడానికి నేను వెళ్లాను. అప్పుడు నన్ను ఆ సెట్ నుండి గెంటేశారు'' అని రణవీర్ చెప్పాడు. 

అయితే ఎందుకు గెంటేశారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో బాలీవుడ్ మీడియా వర్గాలు ఈ విషయాన్ని రవీనా టాండన్ వద్ద ప్రస్తావించారు. దీనికి స్పందించిన ఆమె.. ''రణవీర్ చాలా అల్లరివాడు. అప్పుడు అతడు చిన్న పిల్లాడు. ఇప్పటికీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నందుకు అతడిని అభినందిస్తున్నాను.

అసలు ఆరోజు సెట్ లో ఏం జరిగిందంటే.. అక్షయ్, నాపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి సన్నివేశాల చిత్రీకరణ సమయంలో పిల్లలు ఉండకూడదనేది నా అభిప్రాయం. అప్పుడు రణవీర్ నన్నే చూస్తూ ఉన్నాడు.

పిల్లలపై చెడు ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో సెట్ లో ఉన్న నిర్మాతకి చెప్పి రణవీర్ ని బయటకి పంపించేశా.. అంతేకానీ నాకు తనపై ఎలాంటి కోపం  లేదు'' అని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌