`రావణాసుర` ఎంత పెద్ద డిజాస్టర్‌ అంటే?.. రవితేజకి పెద్ద దెబ్బే..?

Published : Apr 10, 2023, 03:52 PM ISTUpdated : Apr 10, 2023, 03:58 PM IST
`రావణాసుర` ఎంత పెద్ద డిజాస్టర్‌ అంటే?.. రవితేజకి పెద్ద దెబ్బే..?

సారాంశం

`రావణాసుర` చిత్రం  విడుదలై మూడు నాల్గో రోజుకి చేరుకుంది. మరి మొదటి వీకెండ్‌ కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.. వసూళ్లని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన `రావణాసుర` చిత్రం శుక్రవారం విడుదలై తొలి ఆట నుంచి నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కొత్త సీసాలో పాత సారాలా సినిమా ఉందని, దర్శకుడు సుధీర్‌ వర్మ ఏమాత్రం మెప్పించలేకపోయాడనే కామెంట్లు వినిపించాయి. రవితేజ వన్‌ మ్యాన్‌ షో చేసినా, బలమైన కథ, కథనం లేకపోవడంతో `రావణాసుర` ఫ్లాప్‌ని మూటగట్టుకుందనే టాక్‌ ఫిల్మ్ నగర్‌ నుంచి, సోషల్‌ మీడియా నుంచి వినిపిస్తుంది. మరి ఈ సినిమా విడుదలై మూడు నాల్గో రోజుకి చేరుకుంది. మరి మొదటి వీకెండ్‌ కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.. వసూళ్లని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

`రావణాసుర` చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 7.8కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఇప్పుడు మూడు రోజులకు ఈ సినిమా కేవలం రూ.17కోట్ల గ్రాస్‌కి మాత్రమే చేరుకోవడం గమనార్హం. ఈ లెక్కన ఈ సినిమా సుమారు పది కోట్ల షేర్‌ సాధించింది. దాదాపు 25కోట్ల బిజినెస్‌తో ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి డీలా పడిపోయింది. రవితేజ గత చిత్రం `ధమాఖా` హిట్‌ కావడంతో మంచి బిజినెస్సే అయ్యింది. కానీ దాన్ని చేరుకోవడంలో పూర్తిగా వెనకబడిపోయింది. దీంతో ఇప్పుడిది పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సోమవారం కలెక్షన్లు దారుణంగా ఉన్నాయని సమాచారం. 

`రావణాసుర` చిత్రంతోపాటు విడుదలైన `మీటర్‌` సైతం డిజాస్టర్‌ అయ్యింది. ఇది నాని `దసరా` చిత్రానికి హెల్ప్ అవుతుండటం విశేషం. నైజాంలో `దసరా` తన సత్తాని చాటుతోంది. ఇక `రావణాసుర` సినిమాని రవితేజ(ఆర్‌టీ) పిక్చర్స్ పతాకంపై రవితేజ, అభిషేక్‌ పిక్చర్స్ పై అభిషేక్‌ నామా నిర్మించారు. ఈ సినిమా కోసం రవితేజ పారితోషికం కూడా తీసుకోలేదు. ఇప్పుడు అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. సుమారు రూ.50కోట్ల బడ్జెట్‌తో రూపొందగా కొంత డిజిటల్‌ ద్వారా వచ్చింది. పైగా థియేట్రికల్‌గా ఇది సగానికిపైగా నష్టం పోవాల్సి వస్తుంది. నిర్మాతగా రవితేజ తొలి ప్రయత్నానికి గట్టి దెబ్బ పడిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఫలితం నెక్ట్స్ మూవీ `టైగర్‌ నాగేశ్వరరావు`పై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తుంది. పైగా అది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.

నిజానికి రవితేజ నటించిన గత చిత్రం `ధమాఖా` కూడా పెద్దగా ఏం లేదు. అందులో హీరోయిన్‌గా శ్రీలీలా నటించింది. ఆమె నటన, డాన్సులు, అలరి, అందాలు ప్లస్‌ అయ్యాయి. దీంతో హిట్‌ అయ్యింది. లేదంటే ఆ సినిమా కూడా ఫ్లాప్‌ అయ్యేదని అంటున్నారు క్రిటిక్స్. ఇందలు పెద్దగా ఆకట్టుకునే కాస్టింగ్ లేదు, బలమైన కథ లేదు, కథనం లేకపోవడంతో ఆడియెన్స్‌ రిజెక్ట్ చేశారని చెప్పొచ్చు. అను ఇమ్మాన్యుయెల్‌, ఫరియా అబ్దుల్లా, మేగా ఆకాశ్‌ వంటి హీరోయిన్లు ఉన్నా, సుశాంత్‌ కీలక పాత్రలో నటించినా  దీంతో `రావణాసుర` అంతిమంగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌