
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. కు తెలుగులో ఓ రేంజిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన ఆమె వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేయటమే ప్లస్ అవుతోంది. అయితే జాహ్నవి కు హిందీలో వరుస సినిమాలు చేస్తూన్న అనుకున్న బ్రేక్ రావడం లేదు. ఈ క్రమంలో తన రూట్ మార్చి తెలుగు వైపు తన దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భామ మరో రెండు బడా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అవేమిటంటే...
ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే #NTR30
బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రూపొందే చిత్రం. అయితే ఇంకా ఆమెకు స్క్రిప్టు నేరేషన్ జరగలేదని, ఆమె దగ్గర టైమ్ తీసుకున్నట్లు సమాచారం.
అలాగే రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలోనూ ఆమెను అడుగుతున్నట్లు సమాచారం. అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు.
మొదటి చిత్రంతోనే జాహ్నవి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ అందాల భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో కొంత మంది నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. నెపో కిడ్ అని విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ ట్రోల్స్, విమర్శలపై జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడూ స్పందిస్తూంటుంది.
జాన్వీ కపూర్ నుంచి 2022లో రెండు సినిమాలు వచ్చాయి. ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు మూవీస్‌లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆమె త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. ‘ఎన్‌టీఆర్ 30’ లో హీరోయిన్‌గా ఎంపికయిందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. మిగతా ప్రకటనలు కూడా త్వరలోనే వచ్చే అవకాసం ఉంది.