
క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తోంది ఈ టాపిక్. ఎందరో ఆర్టిస్ట్ లు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినవారే.. అయితే అందరూ దానికి లొంగిపోలేదు. ఆఫర్ కోసం నీచమైన పనులు చేయడానికి ఇష్టపడలేదు. తమకు అలాంటి పరిస్దితుల్లో వచ్చే అవకాశాలను ఎందరో నిరాకరించారు. తమ టాలెంట్ తో మాత్రమే ఛాన్సులు సంపాదించుకుని ఉన్నత స్థానాలకు వెళ్లారు. అయితే ప్రారంభం రోజుల్లోని గాయాలు అప్పుడప్పుడూ గుర్తు వస్తూంటాయి. అప్పుడప్పుడూ వారి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఆ క్రమంలో ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్ గతంలో తను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయం గుర్తు చేసుకుంది.
రతన్ రాజ్ పుత్ మాటల్లోనే...'ఆ రోజు ఎప్పటిలాగే నాకు ఆడిషన్ ఉందంటే ముంబయిలోని ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను. ఆడిషన్ పూర్తయిన తర్వాత ఓ కో ఆర్డినేటర్ వచ్చి.. 'డైరెక్టర్‌కి మీ వర్క్ నచ్చింది, మీటింగ్‌కి సిద్ధమవండి' అని చెప్పారు. దీంతో మీటింగ్ కోసం పై అంతస్తుకి వెళ్లాను. వద్దులే అంటున్నా కూల్ డ్రింక్ తాగమని అక్కడ నన్ను బలవంతం చేశారు. ఆ తర్వాత.. 'మరో ఆడిషన్ ఉంది మీకు మళ్లీ ఫోన్ చేస్తాం' అని చెప్పారు. దీంతో నేను నా ఫ్రెండ్ ఇంటికొచ్చేశాం. అయితే మాకు ఇచ్చిన డ్రింక్ తాగాం కానీ అది ఎందుకో తేడాగా అనిపించింది' .
'కొన్ని గంటల తర్వాత వాళ్ల నుంచే ఫోన్ వచ్చింది. ఓ ప్లేస్ చెప్పి, అక్కడికి రమ్మన్నారు. తీరా వెళ్తే అది చాలా భయంకరంగా, చెత్తగా ఉంది. బట్టలన్నీ గదిలో చిందరవందరగా పడున్నాయి. ఓ అమ్మాయి మందు తాగుందో ఏమో స్పృహ లేకుండా నేలపై కనిపించింది. ఓ వ్యక్తి వచ్చి నన్ను తిట్టాడు. ఇతడు ఎవరూ అని నా బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు. అన్నయ్య అని అబద్ధం చెప్పాను. ఎందుకో అక్కడి వాతవరణం తేడాగా అనిపించేసరికి వాళ్లకు సారీ చెప్పి, అక్కడి నుంచి బయటపడ్డాం' అని నటి రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.
ఇక 2009లో వచ్చిన 'అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో' సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న రతన్ రాజ్ పుత్.. మహాభారత్, సంతోషి మా సీరియల్స్ తో చాలా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంది.