రష్మిక ఫేక్ ఫోటోషూట్!

Published : Dec 15, 2018, 11:16 AM IST
రష్మిక ఫేక్ ఫోటోషూట్!

సారాంశం

రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతుందని దాని కారణంగా జీవరాసులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని దీనిపై అవగాహన కార్యక్రమం చేపట్టింది రష్మిక. 

రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతుందని దాని కారణంగా జీవరాసులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని దీనిపై అవగాహన కార్యక్రమం చేపట్టింది రష్మిక. గీత గోవిందం సినిమాతో పాపులర్ అయిన ఈ నటి తన వంతు బాధ్యతగా కాలుష్యాన్ని నివారించాలని దానికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని ఓ ఫోటోషూట్ లో పాల్గొంది.

కర్ణాటకలోని అతి పెద్ద చెరువు బెల్లందూర్ లో నీటిలో దిగి ఫోటో షూట్ లో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అండర్ వాటర్ లో దిగిన ఆమె చుట్టూ ప్లాస్టిక్ కవర్లు ఉండడం, కాలుష్యంతో కూడిన నీటిలోకి ఆమె దిగడంతో అభిమానులు ఒకింత ఆందోళనకి గురయ్యారు.

ఎందుకు రష్మిక ఇంతరిస్క్ చేసిందని..? కాలుష్యం కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉందని.. తెగ ఫీల్ అయిపోయారు. అయితే రష్మిక కాలుష్యబరితమైన నీటిలోకి దిగలేదని, అది ఫోటోషాప్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. 

రష్మిక ఓ స్విమ్మింగ్ పూల్ లో అండర్ వాటర్ లో ఉండగా ఫోటో షూట్ నిర్వహించి దానికి ఫోటోషాప్ చేసి వాటిని ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. ఏదేమైనా ఈ ఫోటోషూట్ ద్వారా రష్మిక కాలుష్యంపై అవగాహన పెంచే ప్రయత్నం మాత్రం చేసిందనే చెప్పాలి. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్