రామ్ గోపాల్ వర్మ ఎవరినైనా తిట్టినా.. పొగిడినా.. దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఇక ఇప్పుడు సడెన్ గా అల్లు అర్జున్ నుఆకాశానికి ఎత్తాడు వర్మ. ఇంతకీ బన్నీ మీద వర్మకు అంత ప్రేమ ఎందుకు.
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) అంత తొందరగా ఎవరినీ పొగడడు.. అంత తేలిగ్గా ఎవరినీ తిట్టడూ.. ఏదైనా సరే అతి వృష్టి.. అనావృష్టి అన్నట్టు ఉంటుంది వర్మ వ్యవహారం. ఈ మధ్య ఏపీ ప్రభుత్వంపై టికెట్ల వ్యవహారంలో గట్టిగా పోరాడుతున్న వర్మ.. తనదైన మార్క్ డైలాగ్స్ తో సందడి చేస్తున్నడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్(Allu Arjun) తో పాటు పుష్ప సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. ఉన్నట్టుండి బన్నీని ఆకాశానికి ఎత్తేశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). పుష్ప సినిమాను ప్రస్తావిస్తూ.. ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్ళావంటూ తెగ పొగిడేశాడు. వర్మ ట్వీట్ చేస్తూ.. హే అల్లు అర్జున్(Allu Arjun).. అంతిమ్,సత్యమేవ జయతే2,83 లాంటి సినిమాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటిని వెనక్కి నెట్టి.. తెలుగు సినిమాను.. ఒక రీజనల్ సినిమా పుష్ప(Pushpa)ను జాతీయ స్థాయిలో నిలబెట్టావ్.. ఈ క్రెడిట్ అంతా నీదే కుదోస్ అంటూ.. బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ.
Hey , After the fate of biggies like and #83 Kudos to you with for making REGIONAL CINEMA into NATIONAL CINEMA 💐💐💐 🙏🙏🙏💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin)
డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప(Allu Arjun) భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా హిందీలో 70 కోట్ల వరకూ వసూలు చేసింది. అన్ని భాషల్లో దూసుకుపోతున్న పుష్పరాజ్ పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేసేశాడు. ఇక రిలీజ్ అయ్యి నెల కూడా తిరగకముందే ఈమూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎక్కబోతోంది. జనవరి 7న అమెజాన్ ప్రూమ్ లో పుష్ప స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read : కుర్ర హీరోలతో రొమాన్స్ కు రెడీ అవుతున్న సీనియర్ స్టార్ హీరోయిన్లు..
జీనియస్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈమూవీలో అల్లు అర్జున్(Allu Arjun) సరసన కన్నడ సోయగం రష్మిక మందన్నహీరోయిన్ గా నటించింది. ఎర్ర చందనం స్మగ్లర్ గా.. లారీ డ్రైవర్ గా రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో బన్నీ కనిపించాడు. విలన్ గా కమెడియర్ కమ్ హీరో సునిల్ క్రూయల్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఇక మలయాళ హీరో ఫహద్ ఫసిల్ ఇంపార్టెంట్ రోల్ చేసిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ డ ఫరెంట్ లుక్ లో కనిపించారు.
Also Read :రెండు జంటల మధ్య బిగ్ బాస్ చిచ్చు.. బ్రేకప్ బాటలో శ్రీహాన్ – సిరి..?