అందరినీ చితక్కొట్టాలనుంది.. రష్మిక కామెంట్స్!

By Udaya DFirst Published 20, Feb 2019, 4:23 PM IST
Highlights

'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటి రష్మిక మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ తరువాత 'గీత గోవిందం'తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొంది. తెలుగులో ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి.

'ఛలో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నటి రష్మిక మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ తరువాత 'గీత గోవిందం'తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొంది. తెలుగులో ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. హీరోయిన్ గా సినిమాలు చేస్తోన్న రష్మికకి విలన్ గా చేయాలని కోరికట. అయితే అలా అని చెడ్డ విలన్ కాదు.. మంచి విలన్ గా కనిపించాలని అనుకుంటోంది. 

దానికి తన రూపం సహకరించదనే అనుమానం పెట్టుకోవద్దని, తన నటనతో అందరినీ మెప్పించగలనని అంటోంది. విలన్ గా మారి అందరినీ చితక్కొట్టాలనుందని అంటోంది రష్మిక. ఇక తాను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, అనుకోనివి జరగడమే జీవితమని.. తన విషయంలో అలాంటివి చాలా జరిగాయని వెల్లడించింది.

తన పెళ్లి రద్దుపై స్పందించిన ఈ బ్యూటీ.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అనుకుంటున్నారని, తన అభిప్రాయానికి ఎవరూ గౌరవం ఇవ్వడం లేదని.. దీంతో పెళ్లి వార్తలకు వివరణ ఇవ్వడం మానుకున్నానని చెప్పింది.

దీనిపై మాట్లాడుతూ.. ''నేను రక్షిత్ సినిమాలతో బిజీగా ఉన్నాం. ఇంత బిజీలో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయలేం. అందుకే రెండున్నర సంవత్సరాలు ఆగుదాం అనుకున్నాం. దీన్ని ఆగడం అనుకున్నా.. రద్దనుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు'' అంటూవెల్లడించింది. 

Last Updated 20, Feb 2019, 4:24 PM IST