ఆ హీరోయిన్ మాయలో త్రివిక్రమ్!

Published : Feb 05, 2019, 03:03 PM IST
ఆ హీరోయిన్ మాయలో త్రివిక్రమ్!

సారాంశం

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఛలో','గీత గోవిందం', 'దేవదాసు' ఇలా ఆమె నటించిన సినిమాలకు మంచి పేరే వచ్చింది. ఈ కారణంగానే దర్శకనిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ హీరోయిన్ మాయలో పడినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకుందామని త్రివిక్రమ్ అంటున్నారట.

మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ ఎక్కువగా దొరకకపోవడంతో మరో హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో త్రివిక్రమ్.. రష్మికని రికమెండ్ చేస్తున్నాడట.

బన్నీ పక్కన హీరోయిన్ గా ఆమెనే ఫైనల్ చేస్తారని అంటున్నారు. అదే గనుక జరిగితే రష్మిక కెరీర్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Jason Sanjay: దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ లవ్ బ్రేకప్ స్టోరీ.. అసలేం జరిగిందంటే?