#Rashmika : నాలుగు ప్రాజెక్టులతో రష్మిక ఫుల్ బిజీ, అవేమిటంటే..

Published : Mar 03, 2024, 01:30 PM IST
#Rashmika : నాలుగు ప్రాజెక్టులతో  రష్మిక ఫుల్ బిజీ, అవేమిటంటే..

సారాంశం

యానిమల్ హై సక్సెస్ తో ఇప్పుడు బాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు , దర్శకులు రష్మిక డేట్స్ కోసం వెంట పడుతున్నారు. 


ఆ మధ్యన కొద్దిగా వెనకబడినట్లు అనిపించింది కానీ హాట్  బ్యూటీ రష్మిక మందన్న యానిమల్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసింది. కమర్షియల్ హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది.  నార్త్‌లో , సౌత్‌ తేడా లేకుండా కుమ్మి పడేస్తున్న ఈ నేషనల్‌ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నాలుగు సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె కాన్సర్టేషన్ మొత్తం వాటిపైనే ఉంది.  అవేమిటంటే..
 
అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబోలో రూపొందుతున్న  “పుష్ప 2″లో ఆమె నటిస్తుంది. అలాగే శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రంలో చేస్తోంది. ఇక వీటితో పాటు  విక్కీ కౌశల్‌తో ‘ఛావా’లో తెరపై కనిపించనుంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో మెప్పించనుంది రష్మిక.   తెలుగులో ఆమె ఇప్పుడు “ది గర్ల్ ఫ్రెండ్” అనే సినిమాలో నటిస్తోంది.  ఆ తర్వాత తెలుగు- తమిళ భాషల్లో రూపొందుతోన్న “రెయిన్ బో” అనే సినిమాకి సంబంధించిన మిగిలిన భాగం పూర్తి చెయ్యాలి. మిగతా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ 2024లో తన డేట్స్ ని బట్టి ఒప్పుకుంటుందట. ఒక్కసారిగా రష్మిక ఇప్పుడు తీరికలేనంతగా బిజీ అయిపోయింది.

వీటితో పాటు  ఆమె ఓ సినిమా స్పెషల్ కామియో రోల్ లో కనిపించబోతోందని సమాచారం. అదీ.. ఓ స్పెషల్‌ సాంగ్‌లో అని రీసెంట్ గా షూటింగ్ జరిగిందని అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటీ అంటే... విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.ఫ్యామిలీ చిత్రాలు డైరక్ట్ చేసి సూపర్ హిట్స్ ఇచ్చే పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక కనపడబోతోంది. అయితే అది కొద్ది సేపే. కథలోని ఓ ప్రత్యేక సందర్భంలో ఓ పాట వస్తుందని సమాచారం.  
 
ఇక యానిమల్ హై సక్సెస్ తో ఇప్పుడు బాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు , దర్శకులు రష్మిక డేట్స్ కోసం వెంట పడుతున్నారు. ఐతే, రష్మిక బాలీవుడ్ లో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా కొత్తగా ఒప్పుకొంది. మిగతా ఆఫర్లను ఒప్పుకోలేదు. ముందుగా ఆమె తెలుగులో ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొత్త చిత్రాలు సైన్ చేస్తుంది. ఒక్కసారిగా రష్మిక ఇప్పుడు ఫుల్  బిజీ అయిపోయింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?