#Inspiration: IAS గా ఎంపికైన చైల్డ్ ఆర్టిస్ట్

By Surya PrakashFirst Published Mar 3, 2024, 12:10 PM IST
Highlights

ఎలాగైనా ఐఏఎస్ సాధించాలన్న తపనతో ఎన్నో ఛాలెంజ్ లను  ఎదుర్కొంది. సినిమాలు, టీవీ షోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నుంచి..


సినిమాల్లోకి వస్తే అక్కడే జీవితం కొనసాగుతుంది..అక్కడే ముగిసిపోతుంది అనుకుంటారు కొందరు. అలాగే సినిమా ఫీల్డ్ ని చిన్న చూపు చూస్తూంటారు మరికొందరు కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా ఒక్కోసారి కావాల్సిన ప్రేరణ ఇవ్వగలుగుతుంది.  అలా చాలా మంది నటులు నిజ జీవితంలో డాక్టర్స్ గా, ఇండస్ట్రలియస్ట్ గా, టీచర్స్ గా, లెక్చరర్స్ గా సెటిలయ్యారు. అలాగే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రోజున ఐఏఎస్ కు ఎంపికై చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.  

హెచ్ఎస్ కీర్తన కప్పుడు బాల నటి, కానీ ఆమె ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. అయితే అందుకు కష్టపడింది. అందుకోసం  సినిమా ప్రపంచానికి దూరంగా ఉంది.  ఎలాగైనా ఐఏఎస్ సాధించాలన్న తపనతో ఎన్నో ఛాలెంజ్ లను  ఎదుర్కొంది. సినిమాలు, టీవీ షోలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారింది. వివరాల్లోకి వెళితే...

హెచ్ఎస్ కీర్తన చిన్నప్పుడు అంటే కొంతకాలం క్రితం  ఒక పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగుతోపాటు కన్నడ సినిమాలు, సీరియల్స్ లోనూ నటించింది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.  'కర్పూరద గొంబే', 'గంగా-యమునా', 'ముద్దిన అలియా','ఉపేంద్ర','ఎ', 'కానూరు హెగ్గదాటి', 'సర్కిల్ ఇన్‌స్పెక్టర్', 'ఓ మల్లిగే', 'లేడీ కమీషనర్', 'హబ్బ', 'దొరే', 'సింహాద్రి', 'జనని','చిగురు', 'పుటాని ఏజెంట్','పుతని' వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. వరస అవకాశాలతో బిజిగా ఉన్నా ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవా చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. 

మొదటి  ప్రయత్నంలో ఫెయిలైంది. అయినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఐదుసార్లు యూపీఎస్సీ పరీక్షకు హాజరైంది. ఐదుసార్లూ ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఆరవ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించింది. తన మొదటి పోస్టింగ్ కోసం కర్ణాటకలోని మాండ్యా జిల్లాను ఎంచుకుంది. అసిస్టెంట్ కమిషనర్ అపాయింట్ అయ్యింది. ఇక ఐఏఎస్ అధికారి కావడానికి ముందు, 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షకు హాజరైంది. దానిని క్లియర్ చేసిన తర్వాత, ఆమె రెండు సంవత్సరాలు KAS ఆఫీసర్‌గా పనిచేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యింది. ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను కొనసాగిస్తూ తన నటనా జీవితాన్నిబాలెన్స్  చేసుకుంది.ఈ క్రమంలో అనేక ఛాలెంజ్ లను ఎదుర్కొన్నప్పటికీ, సంకల్పం, కృషి ఉంటే తాము అనుకున్నది సాధించవచ్చని, తమ కలలను సాకారం చేసుకోవచ్చని హెచ్ఎస్ కీర్తన ప్రూవ్ చేసింది. 
 

click me!