రష్మిక మందన్నా కొత్త సినిమా.. తెలుగు నిర్మాత, బాలీవుడ్‌ హీరో.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

Published : May 12, 2023, 05:32 PM IST
రష్మిక మందన్నా కొత్త సినిమా.. తెలుగు నిర్మాత, బాలీవుడ్‌ హీరో.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

సారాంశం

రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌గా ఆకట్టుకుంటుంది. పాన్‌ ఇండియా హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తున్న ఆమె మరో బాలీవుడ్‌ సినిమాకి కమిట్‌ అయ్యిందట.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా క్రేజ్‌ అంతగా కనిపించడం లేదు. గతంలో మాదిరిగా ఆ హంగామా తగ్గినట్టుంది. ఆమె ఇప్పుడు పూర్తిగా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం `పుష్ప2`, `రెయిన్‌ బో`, బాలీవుడ్‌లో `యానిమల్‌` చిత్రాలు చేస్తుంది. మూడు డిఫరెంట్‌ మూవీస్‌ కావడం విశేషం. `రెయిన్‌ బో` లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్ గా తెరకెక్కుతుంది. `పుష్ప2`, `యానిమల్‌` పాన్‌ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఈ సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకుంది రష్మిక మందన్నా. 

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కొత్తగా మరో సినిమాకి సైన్‌ చేసింది. హిందీలో కొత్త సినిమాకి కమిట్‌ అయిందనితెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో `గుడ్‌ బై`, `మిషన్‌మజ్ను` చిత్రాలు చేసింది. రెండూ డిజప్పాయింట్‌ చేశాయి. ఏమాత్రం మెప్పించలేదు. దీంతోపాటు `యానిమల్‌` చిత్రం త్వరలోనే రాబోతుంది. ఆగస్టు 11న ఈ చిత్రం రిలీజ్‌ కానుందని సమాచారం. కొత్తగా షాహిద్‌ కపూర్‌తో జోడీ కట్టబోతుందట. అనీస్‌ బజ్మీ దర్శత్వంలో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్‌గా రష్మికని అనుకుంటున్నారట, రష్మిక సైతం పాజిటివ్‌గా ఉందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇది కన్ఫమ్‌ అవుతుందని సమాచారం. 

అయితే ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత దిల్‌రాజు నిర్మించబోతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌ అయ్యిందని టాక్‌. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతోపాటు మరో హిందీ సినిమా కూడా రష్మిక చేయబోతుందంటున్నారు. విక్కీ కౌశల్‌తో ఓ సినిమాకి కూడా కమిట్‌ అయ్యిందని అంటున్నారు. దినేష్‌ విజన్‌ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. కానీ బాలీవుడ్‌లో ఈ భామ ఫుల్‌ బిజీ కాబోతుందని అంటున్నారు. 

ఇక తెలుగులో రష్మిక మందన్నా.. `పుష్ప` తర్వాత దానికి కొనసాగింపుగా `పుష్ప2`లో నటిస్తుంది. శ్రీవల్లిగా వెండితెరపై మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది. మొదటి పార్ట్ లో శ్రీవల్లిగా నటించిన రష్మికని పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. రెండో పార్ట్ లో ఆ తర్వాత భన్వర్‌ సింగ్‌ షేకావత్‌తో ఫైట్‌ ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన మూడు నిమిషాల టీజర్‌ని ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచింది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉందట.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు