
నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దసరా లాంటి హిట్ చిత్రం ఇచ్చిన శ్రీకాంత్ పై నాని మరోసారి నమ్మకం ఉంచారు. బలగం డైరెక్టర్ వేణు ని పక్కన పెట్టి మరీ శ్రీకాంత్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది. ఈ మూవీలో ముందుగా రష్మికని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ సడెన్ గా ప్లాన్ మార్చుకుని జాన్వీ కపూర్ కి డైరెక్టర్ కథ చెప్పారు. జాన్వీ కపూర్ ఈ చిత్రానికి ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈ కథ రష్మిక బాడీ లాంగ్వేజ్ కి బాగా సెట్ అవుతుందట. కానీ పాన్ ఇండియా చిత్రం కాబట్టి.. నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేసేందుకు జాన్వీ కపూర్ అయితేనే మేలని నాని, శ్రీకాంత్ నిర్ణయం తీసుకున్నారు. పైగా ఈ చిత్రంలో గ్లామర్.. ఇంటిమేట్ సన్నివేశాలు కూడా ఉన్నాయట.
జాన్వీ కపూర్ కి యూత్ లో క్రేజ్ ఉంది కాబట్టి ఆమెని ఎంచుకోవాల్సి వచ్చింది. పైగా సౌత్ లో జాన్వీ ఇప్పుడిప్పుడే అడుగుపెడుతోంది. ఆల్రెడీ దేవర చిత్రంలో నటిస్తోంది. రాంచరణ్, బుచ్చిబాబు చిత్రానికి కూడా సైన్ చేసింది. ఏది ఏమైనా రష్మిక కి దక్కాల్సిన ఛాన్స్ ని జాన్వీ ఎగరేసుకుపోయింది.