హౌస్ మొత్తం అతనికే సపోర్ట్ .. ఏకాకిలా మిగిలిపోయిన అర్జున్

By Sambi ReddyFirst Published Dec 10, 2023, 2:48 PM IST
Highlights

బిగ్‌ బాస్‌ తెలుగు 7 చివరి వారానికి చేరుకుంది. ఇందులో శివాజీ, అర్జున్‌లు ఆడియెన్స్ ఓటు అప్పీల్‌ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే అందరి సపోర్ట్ మాత్రం ఆ ఒక్కడికే దక్కింది.

బిగ్ బాస్ సీజన్ 7 మరో వారం రోజుల్లో ముగియనుంది. కాగా 14వ వారం రంజుగా సాగుతుంది. ఫన్ టాస్క్ లు అని అంటూనే కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెడుతున్నాడు బిగ్ బాస్. ఓట్ అప్పీల్ చేసుకునేందుకు ఇంటి సభ్యులు తన్నుకుంటున్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ నిర్వహించిన పోటీలో విజయం సాధించిన అర్జున్, శివాజీ కంటెండర్లు గా నిలిచారు. వారిలో ఓట్ అప్పీల్ చేసుకునేందుకు అర్హులు ఎవరో తేల్చాలి అని మిగతా హౌస్ మేట్స్ కి నిర్ణయాన్ని వదిలేశారు బిగ్ బాస్. 

ముందుగా శోభా .. అర్జున్ ఒక సారి ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. కాబట్టి శివాజీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. తర్వాత ప్రశాంత్, అమర్, యావర్, ప్రియాంక కూడా ఇదే రీజన్ చెప్పి శివాజీని సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో శివాజీకి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. తనకు ఓట్లు వేసి గెలిపించాలి అని ఆడియన్స్ ని కోరాడు. కాగా మొదటి నుంచి అద్బుతమైన గేమ్ ఆడుతూ అందరి మనసులు గెలుచుకున్నాడు శివాజి. 

Latest Videos

అయితే ఇంట్లో స్పా బ్యాచ్ వర్సస్ స్పై బ్యాచ్ మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ స్పా గ్రూప్ మొత్తం శివాజీ కి సపోర్ట్ చేయడం విశేషం. గతంలో జరిగిన నంబర్స్ టాస్క్ లో కూడా హౌస్ లో అందరూ కలిసి ఆయనకు మొదటి స్థానంలో నిలబెట్టారు. ఇప్పుడు కూడా అందరూ కలిసి గెలిపించారు. 

ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో శివాజీ కి బాగా ఓట్లు పడుతున్నాయి. ప్రశాంత్, శివాజీ టైటిల్ రేస్ లో పోటీ పడుతున్నారు. ఇక ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది మరో వారం రోజుల్లో తెలిసిపోతుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో.

 

 

click me!