Ram charan-RC15: యంగ్‌ పొలిటీషియన్‌గా రామ్‌చరణ్‌.. మరోసారి డబుల్‌ ధామాకా?

Published : Apr 05, 2022, 02:27 PM ISTUpdated : Apr 05, 2022, 02:35 PM IST
Ram charan-RC15: యంగ్‌ పొలిటీషియన్‌గా రామ్‌చరణ్‌.. మరోసారి డబుల్‌ ధామాకా?

సారాంశం

రామ్‌చరణ్‌కి సంబంధించిన మరో ఆసక్తికర వార్త వైరల్‌ అవుతుంది. పలు ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తన అభిమానులకు శ్రీరామనవమి ట్రీట్‌ ఇవ్వబోతున్నారట చరణ్‌.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రామ్‌చరణ్‌(Ram Charan). ఈ చిత్రంలో తన పాత్ర బాగా హైలైట్‌ కావడంతో లోలోపల ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అందుకు నిదర్శనమే `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) టీమ్‌కి బంగారు కానుకలివ్వడం, పైగా ప్రమోషన్‌లో భాగంగా ఒక్కరే థియేటర్లు తిరుగుతూ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` విడుదలయ్యాక కేవలం రామ్‌చరణ్‌ హడావుడి మాత్రమే కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ కేవలం ఓ నోట్‌తోనే సరిపెట్టాడు. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌ వార్తలు సైతం మరింత హాట్‌ టాపిక్‌గా మారాయి. 

ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌కి సంబంధించిన మరో ఆసక్తికర వార్త వైరల్‌ అవుతుంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో భారీ పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నారు చెర్రీ. `ఆర్‌సీ15`(RC15) వర్కింగ్‌ టైటిల్‌తో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే దాదాపు రెండు మేజర్‌ షెడ్యూల్స్ పూర్తయ్యాయని టాక్‌. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌` హడావుడి పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు చరణ్‌. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రామ్‌చరణ్‌ తన అభిమానులకు శ్రీరామనవమి ట్రీట్‌ ఇవ్వబోతున్నారట. ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ని విడుదల చేసే ఆలోచనలో యూనిట్‌ ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని తెలుస్తుంది. యంగ్‌ సీఎంగా చరణ్‌ కనిపించబోతున్నారట. అంతేకాదు ఇందులో ఆయన మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ పాత్రలో రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. గతంలో `మగధీర`లో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. అయితే అది పూనర్జన్మల కథ. దీంతోపాటు `నాయక్‌`లో డబుల్‌ రోల్స్ చేశారు చరణ్‌.

మరోవైపు గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నారు రామ్‌చరణ్‌. అలాగే బాలీవుడ్‌లోనూ కథ చర్చలు జరుగుతున్నాయి. రెండు పెద్ద బ్యానర్లకి కమిట్‌ అయినట్టు టాక్‌. ఇక ఎన్టీఆర్‌తో కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా మార్చి 25న విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా దాదాపు రూ900కోట్లు వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా రన్‌ అవుతుంది. ఇందులో చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా నటించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు