
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎన్నికల నేపధ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ట్వీట్ చేశారు.
ఎన్నికల సందర్భంగా 'RRR యూనిట్ సగం ఖాళీ అయిందంటూ' రాజమౌళి చెప్పుకొచ్చారు. చిత్రయూనిట్ ఓటు వేయడానికి తమ గ్రామాలకు, సిటీలకు వెళ్లడంతో యూనిట్ సగానికి సగం ఖాళీ అయిందని, ఇది మంచి పరిణామమని అన్నారు.
ఒకవేళ పార్టీ అభ్యర్ధులు, పార్టీలతో తేడాలు వస్తే నోటాకి అయినా ఓటు వేసి ఓటు హక్కుని వినియోగించుకోవాలంతూ పిలుపినిచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమా షూటింగ్ వడోదరాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం పూణేకి పయనమవనున్నారు.