హిందీ ఆల్బమ్ లో రష్మిక మందాన క్రేజీ స్టెప్స్.. వైరల్ వీడియో!

Published : Feb 12, 2021, 03:11 PM IST
హిందీ ఆల్బమ్ లో రష్మిక మందాన క్రేజీ స్టెప్స్.. వైరల్ వీడియో!

సారాంశం

రష్మిక ఓ హిందీ ఆల్బమ్ లో మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. బాద్షా, యువన్ శంకర్ రాజా కలిసి చేసిన 'టాప్ టక్కర్' అనే ఆల్బమ్ లో రష్మిక మందాన ట్రెండీ డ్రెస్సులలో డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. 


స్టార్ హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ బిజీగా ఉన్న రష్మిక మందాన, మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా కనిపించి సందడి చేస్తున్నారు. తాజాగా రష్మిక ఓ హిందీ ఆల్బమ్ లో మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. బాద్షా, యువన్ శంకర్ రాజా కలిసి చేసిన 'టాప్ టక్కర్' అనే ఆల్బమ్ లో రష్మిక మందాన ట్రెండీ డ్రెస్సులలో డాన్స్ వేసి ఆకట్టుకున్నారు. 


అద్భుతమైన సెట్టింగ్స్ లో రష్మిక మందాన కాస్ట్యూమ్స్ అండ్ లుక్ డిఫరెంట్ గా ఉండగా, హీటింగ్ స్టెప్స్ తో కట్టిపడేశారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ వీడియో విడుదల చేయగా వైరల్ అవుతుంది. మరోవైపు తెలుగు మరియు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా రష్మిక అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు . అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీ షూటింగ్ జరుగుతుండగా, రష్మిక డీగ్లామర్ రోల్ చేస్తున్నారని సమాచారం. భారీ ఎత్తున తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న విషయం తెలిసిందే. 

అలాగే తమిళంలో కార్తీకి జంటగా సుల్తాన్ మూవీలో రష్మిక నటించారు. సుల్తాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కన్నడలో ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కిన పొగరు మూవీలో రష్మిక నటించిన విషయం తెలిసిందే. మిషన్ మంజు పేరుతో తెరకెక్కుతున్న హిందీ చిత్రంతో రష్మిక డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది