రష్మిక బ్రేకప్ కి కారణం అతడేనా..?

Published : Sep 17, 2018, 01:59 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
రష్మిక బ్రేకప్ కి కారణం అతడేనా..?

సారాంశం

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా చేయకుముందే ఆమెకి కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం జరిగింది.

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా చేయకుముందే ఆమెకి కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కావాల్సిన ఈ జంట మధ్యలోనే విడిపోవడం ఇప్పుడు కన్నడ, తెలుగు ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. కెరీర్ కోసం రక్షిత్ తో పెళ్లికి నిరాకరించిందని వార్తలు ఊపందుకున్నాయి.

తెలుగులో వరుస అవకాశాలు రావడంతో ఆమె రక్షిత్ ని పక్కన పెట్టేసిందని కన్నడ మీడియా వర్గాలు కథనాలను ప్రచురించాయి. అయితే వీరిద్దరికీ గొడవ ఎక్కడ మొదలైందనే విషయంలో కొన్ని ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జంట బ్రేకప్ కావటానికి రష్మిక మేనేజర్ కారణమని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఛలో, గీత గోవిందం వంటి సినిమాలు రక్షిత్ ఆమోదంతోనే చేసిందట రష్మిక. తెలుగులో ఆమెకి డిమాండ్ పెరగడంతో రక్షిత్ స్వయంగా ఓ మేనేజర్ ని నియమించాడట. అతడు రష్మికకి మంచి ప్రాజెక్టులు వస్తున్నా.. ఆమె వరకు వాటి ప్రస్తావన తీసుకువెళ్లకపోవడంతో నిజం తెలుసుకున్న రష్మిక అతడిని పనిలో నుండి తీసేసి మరో మేనేజర్ ని నియమించుకుంది.

ఈ విషయం రక్షిత్ కి కూడా చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయట. మాట మాట పెరగడంతో రక్షిత్ కూడా బాధ పడినట్లు సమాచారం. అలా గొడవ మరింత పెద్దదై వీరు విడిపోయే వరకు వెళ్లిందని చెబుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ