బిగ్ బాస్2: కౌశల్-తనీష్ ల మధ్య వేడి చర్చ.. కౌశల్ కామెంట్స్ తో హౌస్ మేట్స్ షాక్!

By Udayavani DhuliFirst Published Sep 17, 2018, 12:56 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు కౌశల్. మొదటి నుండి హౌస్ మేట్స్ ఎవరితో కలవకుండా తన గేమ్ తను ఆడుకుంటూ అభిమానులను సంపాదించుకున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు కౌశల్. మొదటి నుండి హౌస్ మేట్స్ ఎవరితో కలవకుండా తన గేమ్ తను ఆడుకుంటూ అభిమానులను సంపాదించుకున్నారు. గత వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుడిగా కౌశల్ రూల్స్ సరిగ్గా పాటించలేదనే కామెంట్స్ వినిపించాయి.

హోస్ట్ నాని సైతం సంచాలకుడిగా నువ్వు డిజాస్టర్ అంటూ కౌశల్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సోమవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్, కౌశల్ మధ్య చర్చలు జరిగాయి. ముందుగా కౌశల్.. ''నాని గారంటే గౌరవం కాబట్టి ఆయనేం అన్నా నేను మాట్లాడలేదు'' అంటూ హౌస్ మేట్స్ తో కౌశల్ అనగా.. హౌస్ మేట్స్ అందరూఒక్కటై కౌశల్ ని టార్గెట్ చేశారు.

''అంటే మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారా..?'' అంటూ రోల్ రైడా ప్రశ్నించగా.. ''బిగ్ బాస్ రూల్స్ నేను ఫాలో అయ్యాను..'' అంటూ చెప్పే ప్రయత్నం చేయగా.. సీన్ లో తనీష్ ఎంటర్ అయ్యి.. ''మీరు ఫాలో అవ్వలేదని నాని చెప్పారు. సంచాలకుడుగా మీరు డిజాస్టర్ అని కూడా అన్నారని'' చెప్పగా.. ''సంచాలకుడిగా నా గేమ్ నేను ఆడుతున్నానని'' కౌశల్ అన్నాడు.

దీనికి వెంటనే తనీష్.. ''అది మేటర్.. సంచాలకుడిగా ఆయన ఆడిన గేమ్ అది'' అని వ్యంగ్యంగా మాట్లాడారు. నేను తప్పు చేస్తే శిక్షకు సిద్ధమని కౌశల్ అన్న మాటకి తనీష్ మరోసారి అతడిపై ఫైర్ అయ్యాడు. గతంలో తను అదే స్టేట్మెంట్ ఇస్తే.. అంగీకరించని కౌశల్ ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించగా ''ఆయన చేస్తే కరెక్ట్ మనం చేస్తే రాంగ్ అంటూ'' గీతా.. తనీష్ కి తన సపోర్ట్ అందించింది. వీరి మధ్య చర్చలు చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగుతుందనిపిస్తుంది. 

click me!