
తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది రష్మి. రష్మీకి ఇటీవల స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించగా కరోనా టెస్ట్ చేయించుకుందని, ఆ రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆమె షూటింగ్స్ అన్నింటికీ దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించి అక్టోబర్ 23వ తేదీన అలాగే అక్టోబర్ 28 తేదీన జరిగే షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు యూనిట్ వర్గాలు పేర్కొనడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే తనకు కరోనా సోకినట్లు రష్మీ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు.
ఇక సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉండగా, రష్మీ గౌతమ్ నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నందుతో కలిసి నటించారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్న సమయంలోనే రష్మీకి కరోనా సోకడంతో ఆ కార్యక్రమాలను కూడా కొద్ది రోజులు నిలిపివేసినట్టు తెలుస్తున్నది. సుధీర్, రష్మీలకు కరోనా సోకిన కారణంగానే శుక్రవారం జరగాల్సిన జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షూటింగ్ అక్టోబర్ 28కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కూడా వీరిద్దరూ కోలుకోకపోతే నవంబర్ మొదటి వారంలో షూటింగ్ జరిపే అవకాశాలున్నాయి.
ఈ నేపధ్యంలో జబర్దస్త్ ఆర్టిస్ట్ లు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో టీవీ నటులందరికీ ఇప్పుడు కోవిడ్ భయం పట్టుకుంది. దీంతో జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు ఇతర టీవీ ఛానళ్ల నటులు, టెక్నీషియన్స్ కోవిడ్ టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క సుడిగాలి సుధీర్‌కు కరోనా వైరస్ సోకడానికి ముందే హైపర్ ఆది కూడా కోవిడ్ బారిన పడ్డారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన ఇప్పటికే కోలుకున్నట్లు సమాచారం.