టీవీల్లో కూడా రికార్డ్ కొట్టేసిన రంగస్థలం!

Published : Oct 25, 2018, 03:25 PM ISTUpdated : Oct 25, 2018, 03:27 PM IST
టీవీల్లో కూడా రికార్డ్ కొట్టేసిన రంగస్థలం!

సారాంశం

కమర్షియల్ గా ఎంత పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నా ఒక నటుడిగా మంచి గుర్తింపు వస్తేనే హ్యాపీగా ఉంటుంది. అయితే రామ్ చరణ్ మాత్రం కమర్షియల్ ఫార్మాట్ లోనే ప్రయోగం చేసి రంగస్థలంతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్నాడు.

కమర్షియల్ గా ఎంత పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నా ఒక నటుడిగా మంచి గుర్తింపు వస్తేనే హ్యాపీగా ఉంటుంది. అయితే రామ్ చరణ్ మాత్రం కమర్షియల్ ఫార్మాట్ లోనే ప్రయోగం చేసి రంగస్థలంతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్నాడు. ఆ సినిమాలో చరణ్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. 

దాదాపు 200కోట్ల బిజినెస్ చేసి చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరి కెరీర్ కు ఆ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. ఇక బుల్లితెరపై కూడా ఈ సినిమా తన సత్తాను చూపించింది. ఇటీవల మొదటి సారి ప్రసారమైన ఈ చిత్రం 19.5 టీఆర్పీతో అందరిని ఆశ్చర్యపరచింది. 

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ సరసన సమంత నటించింది సంగతి తెలిసిందే. ఇక ప్రయోగాల దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాను డైరెక్ట్ చేయగా  దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. 

PREV
click me!

Recommended Stories

హీరోయిన్ లేని సినిమా నాకు వద్దు, అట్టర్ ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమాతో చరిత్ర సృష్టించిన కృష్ణ
Top 10 Netflix Telugu Movies : నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా?