‘తొలిప్రేమ ‘మజ్ను’ వంటి లవ్ స్టోరీలను తెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యంగ్ డైరక్టర్ వెంకీ అట్లూరి తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో సినిమా కావటం, మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో మంచి హైప్ వచ్చింది. అయితే హైప్ వచ్చిన స్దాయిలో ఓపినింగ్స్ రాబట్టుకోలేకపోయింది. అలాగే భారత్ బంద్ ఎఫెక్ట్ కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది. నిన్నటి భారత్ బంద్ కారణంగా ఆంధ్రలో మార్నింగ్ షోలు రన్ కాలేదు. మొదటి షోత్ మంచి హోల్డ్ రాబట్టిన ఈ మూవీ.. ఈవినింగ్ షోలు ఫిల్ అయ్యాయి. రివ్యూలు జస్ట్ ఓకే అన్నట్లు వచ్చినా, బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ చూపించిందని ఫస్ట్ డే కలెక్షన్స్ చెప్తన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తంగా రూ.4.65 కోట్ల షేర్ ను రాబట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సినిమా వీకెండ్ కు పది కోట్ల రూపాయలను రాబట్టే అవకాశం ఉందంటున్నారు. ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం.
నైజాం: రూ.1.54 కోట్లు
సీడెడ్: రూ.60 లక్షలు
ఈస్ట్: రూ.52 లక్షలు
వెస్ట్ : రూ.31 లక్షలు
కృష్ణ: రూ.21 లక్షలు
నెల్లూరు: రూ.24 లక్షలు
వైజాగ్: రూ.56 లక్షలు
గుంటూరు: రూ.67 లక్షలు
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. 4.65 కోట్ల షేర్ రాబట్టింది. రంగ్ దే చిత్రం టీజర్ల్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించడంతో సినిమాపై యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. దాంతో భారీగా థియేటర్లలోకి రావడానికి దోహదపడింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 610 థియేటర్లలో రిలీజైంది.
ఈ చిత్రం రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది మరియు థియేట్రికల్ హక్కులు రూ .4.80 కోట్లకు అమ్ముడయ్యాయి. నాన్-థియేట్రికల్ హక్కులు రూ.20 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఈ చిత్రం విడుదలకు ముందే మేకర్స్ లాభాల భాట పట్టగా ఈ చిత్రం బ్రేక్ఈవెన్ స్థితికి చేరుకోవడానికి రంగ్ దే రూ .25 కోట్లకు పైగా వసూలు చేయాలి.