ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, హీరో తొట్టెంపూడి వేణుకు పితృవియోగం.

By Mahesh JujjuriFirst Published Jan 29, 2024, 10:09 AM IST
Highlights

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ హీరో.. బిజినెస్ మెన్ తొట్టెంపూడి వేణు ఇంట విషాదం నెలకొంది. ఆయన తన  తండ్రిని కోల్పోయారు. 

టాలీవుడ్ సినీ నటుడు, సీనియర్ హీరో  తోట్టెంపూడి వేణు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేణు తండ్రి గారు తోట్టెంపూడి వెంకట సుబ్బారావు గారు ఈరోజు  ఈ రోజు (29.01.2024)  తెల్లవారుజామున పరమపదించారు. 92 ఏళ్ళ వయస్సులో ఆయన వయోబారం మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసినట్టు తెలుస్తోంది. 

తోట్టెంపూడి వెంకట సుబ్బారావు  ఫ్రోఫెసర్ గా ఉద్యోగం చేసిన రిటైర్ అయ్యారు. పొలిటికల్, బిజినెస్ ఫ్యామిలీ గా తొట్టెంపూడి కుటుంబానికి పేరుంది. ఇక వేణు సినీ నటుడిగా, కామెడీ హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇక హీరోగా అవకాశాలు తగ్గడంలో.. చాలా కాలంగ గ్యాప్ ఇచ్చిన వేణు.. తన ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ ఉన్నారు. ఇక రీసెంట్ గా రవితేజ్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు వేణు.  

Latest Videos

ఇక తోట్టెంపూడి వెంకట సుబ్బారావు  భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈ రోజు ఉదయం 9.00 గంటలు నుండి మధ్యాహ్నం 12.00 ల మధ్య వారి స్వగృహం హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్, నందు ఉంచనున్నారు. సందర్శన తరువాత ఈ రోజు మధ్యాహ్నం 12.30 సమయంలో  జూబ్లీహిల్స్, మహాప్రస్థానం లో అంత్యక్రియలు  నిర్వహించనున్నారు. వేణుకు పితృ వియోగం వార్త తెలుసుకున్న ప్రముఖులు ఆయనకు పరామర్శిస్తున్నారు. 

click me!