
బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో రణబీర్ కపూర్ యాక్టింగ్‌లో ఇరగదీస్తాడు. కానీ, పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు మాత్రం ఆయనకు కాస్త తడబాటు ఎక్కువే. గతంలో కూడా చాలా ఈవెంట్స్, ప్రెస్ మీట్లలో ఆయన ఇలాగే నోరు జారాడు. సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్ లీక్ చేయడం లేదా చెప్పకూడని విషయాలు చెప్పేయడం రణబీర్‌కు అలవాటే.
తాజాగా కోల్‌కతాలో జరిగిన 'రామాయణం' ప్రమోషనల్ ఈవెంట్‌లో కూడా రణబీర్ ఇలాగే బుక్కయ్యాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ గురించి స్టేజ్‌పై మాట్లాడుతూ ఆయన పదాలు తడబడ్డాడు. ఇంకేముంది, ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రణబీర్ చేసిన తప్పును పట్టుకుని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
ఈవెంట్‌లో రణబీర్ మాట్లాడుతూ.. "దసరా మనకు ఒక అందమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. చెడు ఎంత బలమైనదైనా సరే, చివరకు అంతం అయ్యేది సత్యం, మంచితనమే (aakhir mein ant sachchai aur achhai ki hi hogi)" అని అన్నాడు. నిజానికి ఆయన "చెడు ఎంత బలమైనదైనా, చివరకు గెలిచేది సత్యం, మంచితనమే" అని చెప్పాలనుకున్నాడు. కానీ, గెలుస్తుంది అనడానికి బదులు అంతం అవుతుంది అని చెప్పడంతో మీనింగ్ మొత్తం మారిపోయింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ "బ్రో రావణుడి టీమ్‌లో జాయిన్ అయ్యాడు" అని కామెంట్ చేయగా.. మరొకరు "బ్రో రాక్డ్, అందరూ షాక్డ్" అని రాసుకొచ్చారు. "ఎవరో అక్కడ చప్పట్లు కూడా కొడుతున్నారు" అని ఇంకొకరు, "కలియుగ సత్యాలు చెబుతున్నాడు" అని వేరొకరు కామెంట్స్ సెక్షన్‌లో సెటైర్లు వేశారు.
నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో 'రామాయణం: పార్ట్ 1' సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా 2026 నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.