Sai Pallavi: 'రామాయణ' కోసం నేను వెజిటేరియన్‌గా మారలేదు.. జపాన్ కష్టాలు చెప్పిన సాయి పల్లవి

Published : Oct 19, 2026, 07:47 PM IST
Sai Pallavi

సారాంశం

'రామాయణం' సినిమాలో సీత పాత్ర చేస్తున్న సాయి పల్లవి తన ఫుడ్ హ్యాబిట్స్ పై క్లారిటీ ఇచ్చారు. తాను మొదటి నుంచి వెజిటేరియన్ అని చెప్పారు. జపాన్ షూటింగ్ టైమ్‌లో పడ్డ ఇబ్బందులను ఆమె గుర్తుచేసుకున్నారు.

బాలీవుడ్ ప్రప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ 'రామాయణం' సినిమాలో సీతగా కనిపించబోతున్నారు సాయి పల్లవి. అయితే ఈ సినిమా కోసమే ఆమె వెజిటేరియన్‌గా మారారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను మొదటి నుంచి శాకాహారినే అని చెప్పారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోనని తేల్చి చెప్పారు.

'రామాయణం' కోసమే వెజిటేరియన్‌గా మారారా?

రణబీర్ కపూర్ రాముడిగా, యష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న 'రామాయణం' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సీత పాత్ర చేస్తున్న సాయి పల్లవి, ఆ క్యారెక్టర్ కోసమే నాన్ వెజ్ మానేశారని ప్రచారం జరిగింది. కానీ, ఈ సినిమా సైన్ చేయకముందు నుంచే తాను వెజిటేరియన్ అని ఆమె పాత ఇంటర్వ్యూల్లోనే చెప్పారు. అంటే, ఇది సినిమా కోసం తీసుకున్న నిర్ణయం కాదు, ఆమె లైఫ్‌స్టైల్.

జపాన్‌లో పస్తులున్నా.. రూల్ బ్రేక్ చేయలేదు!

'అమరన్' సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో జరిగిన ఒక టాక్ షోలో సాయి పల్లవి తన జపాన్ అనుభవాలను పంచుకున్నారు. జపాన్‌లో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జరిగినప్పుడు, అక్కడ సరైన వెజిటేరియన్ ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడ్డారట.

అక్కడ వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పి ఇచ్చే వాటిలో కూడా చికెన్ సూప్ కలిపేవారని ఆమె చెప్పారు. ఫుడ్ దొరకని పరిస్థితి వచ్చినా సరే, తన రూల్స్ మాత్రం బ్రేక్ చేయలేదు. ఒక జంతువును చంపి తినడం కంటే పస్తులుండటమే బెటర్ అని సాయి పల్లవి ఆ షోలో చెప్పారు.

ఎక్కడికెళ్లినా వెజిటేరియనే!

సాయి పల్లవి ఫుడ్ విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో ఈ సంఘటనతో అర్థమవుతోంది. విదేశాలకు వెళ్లినప్పుడు సరైన ఫుడ్ దొరకకపోయినా, తన అలవాట్లను మార్చుకోవడానికి ఆమె ఇష్టపడరు. 'రామాయణం' కోసం ఆమె వెజిటేరియన్‌గా మారారనే రూమర్స్‌కు ఆమె పాత కామెంట్స్ చెక్ పెడుతున్నాయి. వెజిటేరియన్ అనేది సినిమా కోసం చేసిన మార్పు కాదు, అది ఆమె నమ్మకం. రియల్ లైఫ్‌లో కూడా ఫుడ్ విషయంలో ఆమెకు చాలా క్లారిటీ ఉందని ఈ మాటలను బట్టి తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tiger Shroff House: టైగర్ ష్రాఫ్ లగ్జరీ ఇల్లు చూశారా? డిజైన్ అదుర్స్..రూ.31 కోట్ల ఇల్లు అంటే అంతే మరి
Rajinikanth: రజనీకాంత్ ఆస్తి ఆయన కుటుంబ సభ్యులకు చెందదా, మొత్తం ప్రజలకే.. నిజంగా సూపర్ స్టార్ అలా చెప్పారా ?