Deepika Padukone: దీపికా-రణ్‌వీర్ రెండో కూతురి పేరు రివీల్.. క్యూట్ ఫ్యామిలీ పిక్ వైరల్!

Published : Oct 20, 2026, 08:09 PM IST
Deepika Padukone

సారాంశం

దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ రెండో కూతురి పేరును రివీల్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యూట్ ఫ్యామిలీ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పుడు వాళ్లది నలుగురి కుటుంబం! నాన్న రణ్‌వీర్, దీపిక, దువా, దేవి.. అవును, మీరు చదివింది నిజమే! దసరా పండుగ సందర్భంగా దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ రెండో కూతురిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ క్యూట్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ, పాప పేరు 'దేవి పదుకొణె సింగ్' అని రివీల్ చేశారు.

పసుపు రంగు ట్రెడిషనల్ డ్రెస్‌లలో ఈ ఫ్యామిలీ అంతా చూడముచ్చటగా ఉన్నారు. "ప్రేమ, సమృద్ధితో... దేవి పదుకొణె సింగ్'' అని ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.

ఇక్కడ చూడండి!

బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫోటో!

ఈ స్టార్ కపుల్ షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఐవరీ, గోల్డెన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్‌లలో వీరు మెరిసిపోయారు. ఈ ఫోటోలో పెద్ద కూతురు దువా కూడా ఉంది. దీపిక చేతుల్లో ఉన్న చిన్నారి దేవికి, దువా ముద్దు పెడుతుండగా.. రణ్‌వీర్ సింగ్ దువాను ఎత్తుకుని మురిసిపోతున్నాడు. అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న బాండింగ్, ఆ కుటుంబం సంతోషం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రేమ, సమృద్ధితో... దేవి పదుకొణె సింగ్ " అని వారు రాసుకొచ్చారు.

అభిమానుల రియాక్షన్ ఇదే!

ఈ క్యూట్ ఫోటో చూసి సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. చిన్నారికి ఆశీస్సులు అందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఈ అందమైన కుటుంబానికి దిష్టి తగలకూడదు (No najar to the beautiful family)" అని ఒకరు కామెంట్ చేయగా.. "దేవికి, మీ కుటుంబానికి మా ప్రార్థనలు (all our duas to devi and family)" అని మరొకరు రాసుకొచ్చారు. "దేవి.. చాలా పవిత్రమైన పేరు, హ్యాపీ దసరా (Devi such a Devine name Happy Dussehra)" అని ఇంకొకరు కామెంట్ చేశారు.

వాళ్ల హ్యాపీ ఫ్యామిలీ గురించి..

దీపికా, రణ్‌వీర్‌ల పెద్ద కూతురు దువా పదుకొణె సింగ్ 2024 సెప్టెంబర్ 8న జన్మించింది. 'దువా' అంటే ప్రార్థన అని అర్థం. ఇక వీరి రెండో కూతురు దేవి పదుకొణె సింగ్ 2026 సెప్టెంబర్ 19న పుట్టింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Teja Sajja: త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న తేజ సజ్జా, అమ్మాయి ఎవరో తెలుసా.. మెగా హీరో కూడా పెళ్ళికి రెడీ
Riteish Deshmukh: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న జెనీలియా భర్త.. ఆ హీరో కోసమే నిర్ణయం ?