రణ్‌బీర్‌ కపూర్‌ వేసుకున్న షూస్‌ రేట్‌ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. లిమిటెడ్‌ ఎడిషన్‌

Published : Jan 11, 2021, 02:22 PM IST
రణ్‌బీర్‌ కపూర్‌ వేసుకున్న షూస్‌ రేట్‌ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. లిమిటెడ్‌ ఎడిషన్‌

సారాంశం

ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్ లో రణ్‌ బీర్‌ కపూర్‌ బ్లూ టైట్‌ టీషర్ట్ జాకెట్‌, బ్లూ జీన్స్ ధరించి, చేతిలో బ్యాగ్‌ పట్టుకుని పరుగున వెళ్తూ కెమెరా కన్నుకి చిక్కారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు టకా.. టకా ఫోటోలైతే తీశారు. కానీ ఆ తర్వాత తరచి చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 

సెలబ్రిటీలు, స్టార్స్ ఏం ధరించినా అది ప్రత్యేకమే. చాలా వరకు స్టయిల్‌కి ఐకాన్‌గా మారుతుంటాయి. అదొక బ్రాండ్‌ అవుతుంటాయి. స్టార్స్ వేసుకున్న డ్రెస్‌, గాడ్జెట్స్, షూట్‌ ఇలా ప్రతిదీ స్పెషలే. ఇటీవల ఎన్టీఆర్‌ షూస్‌ వైరల్‌ అయ్యాయి. దాని గురించే చర్చ జరిగింది. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ వేసుకున్న షూస్‌ వైరల్‌ అవుతున్నాయి. ఆయన ధరించిన షూస్‌ కాస్ట్ తెలిస్తే మాత్రం ఫ్యూజ్‌లు ఎగిరిపోవడం ఖాయం. 

ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్ లో రణ్‌ బీర్‌ కపూర్‌ బ్లూ టైట్‌ టీషర్ట్ జాకెట్‌, బ్లూ జీన్స్ ధరించి, చేతిలో బ్యాగ్‌ పట్టుకుని పరుగున వెళ్తూ కెమెరా కన్నుకి చిక్కారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు టకా.. టకా ఫోటోలైతే తీశారు. కానీ ఆ తర్వాత తరచి చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ ఫోటోల్లో అందరి దృష్టి అతడు ధరించిన స్నీకర్స్‌ (స్పోర్ట్స్‌ షూస్‌) మీద పడింది. నైకి అండ్‌ డియోర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌గా వచ్చిన ఈ స్నీకర్స్‌ వెల దాదాపు ఐదున్నర లక్షల రూపాయలు అట.

ఈ సంస్థ కేవలం ఎనిమిది వేల జతలు మాత్రమే తయారు చేసింది. వాటిలో ఒకటి రణ్‌బీర్‌ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ధరించిన ఈ షూట్‌ బ్రాండ్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు ఆయన పట్టుకున్న బ్యాక్‌ ధర కూడా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆ బ్యాగు ధర లక్ష రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తుంది. బాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ క్రేజీ స్టార్‌గా రాణిస్తున్న రణ్‌బీర్‌ కపూర్‌ ప్రస్తుతం అలియా భట్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమెని వివాహం చేసుకోబోతున్నారు. 

మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్నాడు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తుండగా, షారూఖ్‌ ఖాన్‌ గెస్ట్ గా మెరవనున్నారు. అలాగే `షంషేరా` సినిమా పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. దీంతోపాటు లవ్‌ రంజాన్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు రణ్‌బీర్‌ కపూర్‌.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌