Vinodhaya Sitham Remake: పట్టాలెక్కిన వినోదయ సిత్తం రీమేక్... 20 రోజులకు 50 కోట్లు తీసుకుంటున్న పవన్!

By Sambi ReddyFirst Published Jun 24, 2022, 4:44 PM IST
Highlights

వినోదయ సిత్తం రీమేక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. పవన్ కళ్యాణ్ కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. ఇక ఈ చిత్రం కోసం పవన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ మైండ్ బ్లాక్ చేస్తుంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వినోదయ సిత్తం రీమేక్ చేయనున్నట్లు చాలా కాలంగా ప్రచారం అవుతుంది. దర్శకుడు సముద్ర ఖని పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. మరో వైపు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తున్నారు. సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు కుడా పూర్తి కాలేదు. ఇక భవదీయుడు భగత్ సింగ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో  అసలు వినోదయ సిత్తం రీమేక్ ఉంటుందా? లేదా? అనే సందేహం అభిమానుల్లో ఉంది. అన్ని అనుమానాలకు నేడు క్లారిటీ వచ్చేసింది. వినోదయ సిత్తం రీమేక్ అధికారికంగా ప్రారంభమైంది. 

నేడు హైదరాబాద్ లో వినోదయ సిత్తం(Vinodhaya Sitham) రీమేక్ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ముందు పవన్ కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాలు పూర్తి చేస్తారు. అక్టోబర్ నుండి ఆయన బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. జులై, ఆగష్టు నెలల్లో వినోదయ సిత్తం పవన్ పార్ట్ పూర్తి చేయాలి. ముందుగానే పవన్ దర్శక నిర్మాతలు స్పష్టంగా తెలియజేశారు. అందులోనూ పవన్ పార్ట్ ఈ మూవీలో చాలా తక్కువ. సాయి ధరమ్ మరో హీరోగా నటిస్తుండగా అధిక భాగం ఆయనపై నడుస్తుంది. 

ఇక వినోదయ సిత్తం గోపాల గోపాల చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. పవన్ మరోసారి భగవంతుడిగా నటిస్తున్నాడు. కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే పవన్ ఈ చిత్రం కోసం కేటాయించారట. పవన్ ఎన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నా...  రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రం కన్ఫర్మ్. కాబట్టి ఈ చిత్రానికి పవన్ దాదాపు రోజుకు 2.5 కోట్లు వసూలు చేసినట్లు. ఇక హరి హర వీరమల్లు సైతం పూర్తిగా ఆపేసినట్లు వార్తలు వస్తున్నాయి. హరి హర వీరమల్లు రషెస్ చూసిన పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రస్తుతానికి హరి హర వీరమల్లు కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.  

click me!