బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ తో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ రీసెంట్ రికార్డులను బ్రేక్ చేసి బాలీవుడ్ ను షేక్ చేశారు. ఈ పాన్ ఇండియా మూవీ నిన్న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
‘అర్జున్ రెడ్డి’ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) నుంచి వచ్చిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘యానిమల్’ (Animal). బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)తో మరోసారి వాయిలెంట్ అంటే ఎంటో చూపించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు టాక్ అదిరిపోయింది. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. తొలిరోజే సాలిడ్ మార్క్ ను రీచ్ అవ్వడం ఆసక్తికరంగా మారింది.
Animal The Film ఫస్ట్ డే రూ.116 కోట్లు కలెక్షన్లు సాధించినట్టు తాజాగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతో సందీప్ రెడ్డి ఓ రికార్డును బ్రేక్ చేశారని నిపుణులు అంటున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ ఖాన్ లు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘జవాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. అలాగే సల్మాన్ ఖాన్ (Salmaan Khan) ‘టైగర్3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
కాగా, సందీప్ రెడ్డి వంగా - రన్బీర్ కపూర్ లో కాంబోలో వచ్చిన ‘యానిమల్’ మొదటిరోజు వసూళ్లను ఆ రెండు చిత్రాలను మించి సాధించింది. ఫస్ట్ డే ఇండియాలో 65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక పఠాన్ - రూ.57 కోట్లు, టైగర్ - 3 - రూ.44 కోట్లు వసూళ్లు రాబట్టాయి. దీంతో ఖాన్ లను కపూర్ దాటిపోయారని అంటున్నారు. మరోవైపు సౌత్ లో ఆ ఇద్దరు బడా స్టార్స్ తో పోల్చితే రన్బీర్ కు పెద్దగా క్రేజ్ లేదు. అయినా సందీప్ రెడ్డి రన్బీర్ తో ఈరికార్డును బ్రేక్ చేయడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. అలాగే రన్బీర్ ను వాయిలెంట్ గా చూపించడంపైనా ప్రశంసలు అందుకుంటున్నారు డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..
సినిమా విషయానికొస్తే.. నిన్న విడుదలైన ‘యానిమల్’కు పాజిటివ్ టాక్ దక్కింది. రన్బీర్ కపూర్ పెర్ఫామెన్స్, సందీప్ ఫిల్మ్ మేకింగ్ తీరు, యాక్షన్, రష్మిక మందన్ననటనకూ మంచి మార్కులు పడుతున్నాయి. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ అదిరిపోవడంతో సినిమాకు మంచి టాక్ ను సొంతం చేసింది. సెకండాఫ్ లెన్తీగా ఉన్నా పర్లేదనేలా చేశారు సందీప్. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ మరియు టీ సిరీస్ బ్యానర్ పై నిర్మించారు. రన్బీర్ -రష్మిక జంటగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఇక సందీప్ నెక్ట్స్ అల్లు అర్జున్, ప్రభాస్ తో సినిమాలు చేయనున్నారు. ఆలోగా మహేశ్ బాబు సినిమాపైనా క్లారిటీ రానుంది.
He has come to conquer all the records 🤙🏼🔥🪓
Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb … pic.twitter.com/bF8nV2Nw09