కరోనా రాకపోయింటే అలియాతో పెళ్లి జరిగిపోయి ఉండేదిః రణ్‌బీర్‌ కపూర్‌ క్లారిటీ

Published : Dec 24, 2020, 09:09 PM IST
కరోనా రాకపోయింటే అలియాతో పెళ్లి జరిగిపోయి ఉండేదిః రణ్‌బీర్‌ కపూర్‌ క్లారిటీ

సారాంశం

అలియా తన గర్ల్ ఫ్రెండ్‌ అని ఒప్పుకున్నాడు రణ్‌బీర్‌ కపూర్‌. పెళ్లికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. కరోరా రాకపోయి ఉంటే ఇప్పటికే మ్యారేజ్‌ జరిగేదని వెల్లడించారు.

బాలీవుడ్‌లో క్రేజీ లవ్‌ కపుల్‌ ఎవరైనా ఉన్నారంటే అది రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ అనే చెప్పాలి. వీరిద్దరు గత కొన్ని రోజులుగా ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. డేటింగ్‌లో ఉన్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఈ జంటపై వార్తలే వినిపిస్తున్నాయి. అంత క్రేజీ లవ్‌కపుల్‌గా నిలిచారు. అయితే వీరిద్దరు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. 

తాజాగా దీనిపై స్పందించారు రణ్‌బీర్‌ కపూర్‌. పెళ్లికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. అలియా తన గర్ల్ ఫ్రెండ్‌ అని ఒప్పుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ, అలియాతో నా వివాహం ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. కానీ లాక్‌ డౌన్‌ వల్ల ఆది వాయిదా పడింది. త్వరలోనే ఉంటుంది. దీనిపై ఇంకా ఎక్కువ వివరాలు తెలియజేయలేను` అని తెలిపారు. దీంతో ఇప్పుడీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. రణ్‌బీర్‌ చెప్పినదాన్ని ప్రకారం వచ్చే ఏడాది వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని చెప్పొచ్చు. 

అయితే ఇప్పటికే ఇరుకుటుంబాల మధ్య రణ్‌బీర్‌, అలియా వివాహానికి సంబంధించిన చర్చ కూడా జరిగిందట. ఇరు కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని సమాచారం. ఇక మ్యారేజ్‌ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమంటున్నారు. ఇక ఈ క్రేజీ లవ్‌ జోడీ ప్రస్తుతం కలిసి `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?