మహేష్‌ ఫ్యామిలీకి పవన్‌ కిస్మస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌.. ఫిదా అయిన నమ్రత

Published : Dec 24, 2020, 12:40 PM IST
మహేష్‌ ఫ్యామిలీకి పవన్‌ కిస్మస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌.. ఫిదా అయిన నమ్రత

సారాంశం

పవన్‌ సైతం సర్‌ప్రైజ్‌ చేశారు. మహేష్‌బాబు ఫ్యామిలీకి, బండ్ల గణేష్‌ వంటి వారికి క్రిస్మస్‌ కానుకలు అందించారు. వారిని సర్‌ప్రైజ్‌కి గురి చేశారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా పవన్‌ కళ్‌యాణ్‌, ఆయన భార్య అన్నా లెజ్‌నేవా కలిసి మహేష్‌ ఫ్యామిలీకి బహుమతులు అందజేశారు. 

దీపావళి సందర్భంగా సూపర్‌ స్టార్ మహేష్‌ కొంత మంది సినీ ప్రముఖులకు గిఫ్ట్ లు బహుమతులుగా పంపించి సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్‌ సైతం సర్‌ప్రైజ్‌ చేశారు. మహేష్‌బాబు ఫ్యామిలీకి, బండ్ల గణేష్‌ వంటి వారికి క్రిస్మస్‌ కానుకలు అందించారు. వారిని సర్‌ప్రైజ్‌కి గురి చేశారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా పవన్‌ కళ్‌యాణ్‌, ఆయన భార్య అన్నా లెజ్‌నేవా కలిసి మహేష్‌ ఫ్యామిలీకి బహుమతులు అందజేశారు. 

ఈ విషయాన్ని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా పవన్‌కి, ఆయన భార్య అన్నాకి ప్రత్యేకంగా ధన్వవాదాలు తెలియజేసింది. ఇదిలా ఉంటే ఇరువురి బర్త్ డే టైమ్‌లో పవన్‌, మహేష్‌బాబు ఒకరినొకరు విషెస్‌ తెలియజేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా క్రిస్మస్‌ గిఫ్టులు పంపండంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో దీన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. 

మరోవైపు నిర్మాత బండ్ల గణేష్‌కి సైతం పవన్‌ గిఫ్ట్ పంపించాడు. దీంతో ఆయన ఆనందానికి అవద్దుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, `మీ ప్రేమకి నేనెప్పుడూ బానిస నే బాస్‌ అంటూ పవన్‌ కళ్యాణ్‌ నా దేవుడు` అని పేర్కొన్నాడు. మరోవైపు ప్రముఖ సినిమా పోస్టర్‌ డిజైనర్‌ అనిల్‌ భాను కలిసి పవన్‌కి ఆర్ట్ డిజైన్‌ని బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని పవన్‌ ఇస్టా ద్వారా పంచుకున్నారు. 

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌ సాబ్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇది అటవి ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అక్కడి ఆదివాసీలు పాడిన ఓ పాటని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటించనున్నాడు. ఇది ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో రానా మరో హీరోగా నటిస్తున్నారు. దీనికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

మరోవైపు మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటించబోతున్నారు. ఇది కూడా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోబోతుంది. దీనికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే `భీష్మ` డైరెక్టర్‌ వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్