'రణరంగం' ట్విట్టర్ రివ్యూ!

Published : Aug 15, 2019, 07:25 AM IST
'రణరంగం' ట్విట్టర్ రివ్యూ!

సారాంశం

యువ కథానాయకుడు శర్వానంద్‌ నటించిన చిత్రం ‘రణరంగం’. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికలుగా నటించారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. 

శర్వానంద్ హీరోగా వస్తోన్న యాక్షన్ డ్రామా 'రణరంగం'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణిప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలు పడడంతో టాక్ బయటకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్‌గా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్ తో కూడి ఉందని అంటున్నారు.

భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. 'గ్యాంగ్ స్టర్' పాత్రలో శర్వానంద్ నటన అద్భుతంగా ఉందని.. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. 

సినిమాలో ప్రతీ పాత్ర స్పెషల్ గా ఉందని..  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ గా నిలిచిందట. సినిమాలో కొన్ని డైలాగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీక్లైమాక్స్ ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. 1990, ప్రస్తుత కాలంలోని సన్నివేశాలతో సాగే స్క్రీన్ ప్లే మరో ప్రధాన బలమని ట్వీట్స్ చేస్తున్నారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు