నక్సలైట్‌ ప్రేమ కథ.. `విరాటపర్వం` సంక్రాంతి విషెస్‌..లుక్‌ అదిరింది!

Published : Jan 13, 2021, 11:20 AM IST
నక్సలైట్‌ ప్రేమ కథ.. `విరాటపర్వం` సంక్రాంతి విషెస్‌..లుక్‌ అదిరింది!

సారాంశం

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న `విరాటపర్వం` సినిమా నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా నయా పోస్టర్‌ విడుదలైంది. నక్సల్‌ గెటప్‌లో ఉన్న రానాని పట్టుకుని సాయిపల్లవి వెళ్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ కథని తెలియజేసేలా ఉన్న ఈ  కొత్త పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించడంతోపాటు ఆకట్టుకుంది.

దగ్గుబాటి రానా హీరోగా రూపొందుతున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి.. రానా సరసన నటిస్తుంది. ప్రియమణి, నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషిస్తుంది. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి నయా పోస్టర్‌ విడుదలైంది. నక్సల్‌ గెటప్‌లో ఉన్న రానాని పట్టుకుని సాయిపల్లవి వెళ్తుంది. ఈ కొత్త పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించడంతోపాటు ఆకట్టుకుంది.

ఇందులో నక్సలైట్‌ అయిన రానాకి, ఆయన చేసే ఉద్యమానికి మద్దతిస్తూ, ఆయన్ని ప్రేమించే అమ్మాయిగా కనిపించనుందని తెలుస్తుంది. మాజీ నక్సలైట్‌ రవన్న(డాక్టర్ రవిశంకర్‌) జీవితం ఆధారంగా, 1990లో జరిగిన యదార్థ సంఘటన నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. `ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది.. సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.. డాక్టర్‌ రవిశంకర్‌ అలియాస్‌ కామ్రేడ్‌ రవన్న..` అనే విషయాలను చూపించారు. తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం.. మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం.. `విరాటపర్వం` అని దర్శకుడు వేణు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Anand Deverakonda : రష్మిక మందన్నతో ఆనంద్ దేవరకొండ స్టెప్పులు, విజయ్ దేవరకొండ పెళ్లిలో.. బేబీ హీరో రచ్చ
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆడపడుచు మృతి.. 30 ఏళ్లకే మాయా కిబెల్ ఎలా కన్నుమూసిందంటే?