రామ్ చరణ్ కు రానా సాయం.. క్లిక్ అయితే కేకే!

By AN TeluguFirst Published Sep 26, 2019, 10:29 AM IST
Highlights

కామిక్ పుస్తకాల ద్వారా చిన్నారులకు భారత సంస్కృతిని చేరువ చేసిన ‘అమర్ చిత్ర కథ’ త్వరలోనే థీమ్ పార్కులు, లెర్నింగ్ సెంటర్ల రూపంలో మన ముందుకు రానుంది. వీటిని ప్రమోట్ చేయడం కోసం ఫ్యూచర్ గ్రూప్‌ రానాతో జతకట్టింది.

 

దగ్గుపాటి రానా, రామ్ చరణ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. వయస్సు పెరిగే కొలిదీ ప్రాణస్నేహితులు అయ్యారు. ఇద్దరూ చెన్నైలోనే పుట్టడం...అక్కడ కొంతకాలం పెరగటం... ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కి షిఫ్ట్ అయినప్పుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగటమే కాక, ప్రొఫిషనల్ గానూ ఒకరికొకరు సాయిం అందించుకుంటూ ముందుకు వెళ్లే స్దాయికి వెళ్లింది. తాజాగా రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి ని హీరోగా పెట్టి భారీ బడ్జెట్ తో  సైరా చిత్రం చేసారు. వచ్చే నెల రెండవ  తేదీన విడుదల అయ్యే ఈ సినిమా ప్రమోషన్ కు , బాలీవుడ్ బిజినెస్ కు, తన వంతు సాయిం చేసారు రానా.

అలాగే కామిక్ పుస్తకాల ద్వారా చిన్నారులకు భారత సంస్కృతిని చేరువ చేసిన ‘అమర్ చిత్ర కథ’ త్వరలోనే థీమ్ పార్కులు, లెర్నింగ్ సెంటర్ల రూపంలో మన ముందుకు రానుంది. వీటిని ప్రమోట్ చేయడం కోసం ఫ్యూచర్ గ్రూప్‌ రానాతో జతకట్టింది. భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని చాటేలా ఈ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అమర చిత్ర కథ గ్రూప్ తో తనకు ఉన్న అనుబంధంతో  ‘నరసింహా రెడ్డి.. ది లయన్ ఆఫ్ రాయలసీమ’ అనే టైటిల్ ఓ కామిక్ బుక్ తేనున్నారు.

 ఇప్పటికే విడుదలైన ఈ పుస్తక ముఖచిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.  ఈ స్వాతంత్ర సమరయోధుడి చరిత్రను చిన్నారులకు తెలియజేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమర్ చిత్ర కథ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే సైరా సినిమాను పిల్లలకు చేరువ చేయటంలో అమర చిత్ర కథ కామిక్ బుక్ బాగా పనికి వస్తుందని, ముఖ్యంగా నార్త్ లో ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అది కనక జరిగితే రామ్ చరణ్ కు రానా పెద్ద సాయిం చేసినట్లే.
 
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘సైరా నరసింహారెడ్డి’ ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటుంది. దాదాపు రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా.. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది.  అక్టోబర్ 2న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ హక్కుల అమ్మకంలో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది.

click me!