చిరంజీవి సినిమా నుంచి రానా ఔట్‌.. విలన్‌గా బాలీవుడ్‌ నటుడు..

Published : Dec 27, 2023, 03:52 PM IST
చిరంజీవి సినిమా నుంచి రానా ఔట్‌.. విలన్‌గా బాలీవుడ్‌ నటుడు..

సారాంశం

చిరంజీవి సినిమాలో రానా దగ్గుబాటి నటిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. దీంతో బాలీవుడ్‌ నటుడిని దించినట్టు సమాచారం. 

మెగాస్టార్‌ చిరంజీవి `భోళా శంకర్‌` వంటి డిజాస్టర్‌ తర్వాత ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు. `బింబిసార` దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఆ మధ్య ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పటికే చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు. ఓ షెడ్యూల్‌ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. ఈ మూవీలో రానా కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆయన విలన్‌గా కనిపిస్తారని అన్నారు. 

కానీ లేటెస్ట్ సమాచారం మేరకు.. ఈ మూవీ నుంచి రానా  తప్పుకున్నారట. డేట్స్ ఇష్యూ వల్ల సినిమా చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది. దీంతో రానా స్థానంలో మరో నటుడిని వెతికారు మేకర్స్. బాలీవుడ్‌ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్‌లో విలన్‌ పాత్రలతో, విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు. కునల్‌ కపూర్‌. తాజాగా ఆయన్ని చిరంజీవి సినిమా కోసం ఎంపిక చేశారట. అంతేకాదు ఏకంగా సెట్‌లోకి కూడా అడుగు పెట్టినట్టు సమాచారం. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుందని, ఇందులో కునల్‌ పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఆయనపై పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు వశిష్ట. ఇదిలా ఉంటే చిరంజీవి త్వరలోనే ఈ మూవీ సెట్‌లోకి అడుగుపెడతాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన లేని సీన్లు షూట్‌ చేస్తున్నారట. మరి ఆయన ఎప్పుడు ఎంటర్‌ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష ఫైనల్‌ అయ్యింది. ఆమెతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్‌ ఉందని, గ్లామర్‌కి కొదవ లేదని అంటున్నారు. 

చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రానికి `విశ్వంభర` అనే టైటిల్‌ వినిపిస్తుంది. ఆల్మోస్ట్ మేకర్స్ కన్ఫమ్‌ చేశారట. సోషియో ఫాంటసీగా సినిమా రూపొందుతుందని, ప్రస్తుత అంశాలు కూడా  ఉండబోతున్నాయని అంటున్నారు. ఇందులో చిరంజీవి భీమవరం దొరకబాబుగా కనిపిస్తాడట. మరి ఆయనకు, ముళ్లోకాలకు సంబంధం ఏంటనేది ఈ సినిమాలో ఆసక్తికరం అని టాక్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్