ఎన్టీఆర్ దేవర టీజర్‌ రెడీ.. హింట్ ఇచ్చిన అనిరుధ్‌.. దిల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..

Published : Dec 27, 2023, 03:27 PM IST
ఎన్టీఆర్ దేవర టీజర్‌ రెడీ.. హింట్ ఇచ్చిన  అనిరుధ్‌.. దిల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..

సారాంశం

గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానేవచ్చింది. తారక్ సినిమానుంచి సాలిడ్ అప్ డేట్ మీకోసం వచ్చేస్తోంది.  ఇదిగో ఇదేసాక్ష్య.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి ఆకలి మిద ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ నుంచి సినిమా రాలేదు. దాంతో మంచి ఆకలి మీద ఉన్నారు. ఎన్టీఆర్  సినిమా కోసం ఎదరు చూస్తున్నారు. కనీసం  మంచి అప్ డేట్ అయినా ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు. రెండేళ్లుగా తమ అభిమాన హీరో బోమ్మ థియేటర్లో పడకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. కాని తారక్ మాత్రం తన ఫ్యాన్స్ కోసం సాలిడ్ స్టఫ్ ను రెడీ చేస్తున్నాడు. అద్భుతమైన విందును ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కాస్త లేట్ అయినా ఆగండి అంటున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సినిమానుంచి సాలిడ్ అప్ డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎంతో ఆలోచించి.. స్క్రిప్ట్ ను ప్లాన్ చేసి మరీ తెరకెక్కిస్తున్న సినిమా దేవర.  ఎన్టీఆర్‌ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జన్వీ కపూర్ హీరోయిన్ గా  నటిస్తున్న సినిమా దేవర.  ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ  దేవర కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక పోస్టర్‌ మాత్రమే రిలీజ్‌ అయ్యింది. కాని దేవర  సినిమాపై భారీ అంచనాలు మాత్రం ఉన్నాయి. 

అయితే ఈమూవీ నుంచి  టీజర్‌ త్వరలో రాబోతుందని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీజర్‌ రిలీజ్ కు  రెడీగా ఉండాలంటూ.. హింట్ ఇచ్చారు ఈమూవీ మ్యూజిక్ డైరెక్టర్.. మ్యూజిక్ సంచలనం అనిరుధ్‌.   అనిరుధ్‌ ఇచ్చిన హింట్‌ అభిమానుల్లో జోష్‌ను పెంచింది. దేవర టీజర్‌కు సంబంధించి అనిరుధ్‌ మంగళవారం సాయంత్రం ట్విట్లర్ లో  ఒక పోస్ట్‌ పెట్టాడు. దేవర టీజర్‌ అని రాసి పక్కనే చప్పట్లు కొడుతున్న ఎమోజీలు పెట్టాడు. 

 

అంతే కాదు ఎన్టీఆర్‌, కొరటాల శివ ఆన్‌ ఫైర్‌ అన్నట్టుగా ఫైర్‌ ఎమోజీలు ఉంచారు. ఎగ్జయిటెడ్‌ అని చెపుతూ..మ్యూజిక్  ఎమోజీలు పెట్టాడు. అంటే  టీజర్‌కి అనిరుధ్ మ్యూజిక్‌ కంప్లీట్ అయ్యిందని చెప్పాడా..? లేక టీజర్ రాబోతోంది.. ఇక రచ్చ రచ్చే అని చెపుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.  అనిరుధ్ పెట్టిన ఒక హ్యా్ష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. #AllHailTheTiger అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు అనిరుధ్. ఈ హ్యాష్ ట్యాక్ అర్దం ఏంటా అని అంతా చూస్తున్నారు. పులికి అందరూ సలాం కొడతారు అని అనిరుధ్ అనడంతోతో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

దేవర సినిమాకు అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాకు ఆయన సంగీతం అంటే.. తారక్ ను దృష్టిలో పెట్టుకుని ఎలా ఇచ్చి ఉంటాడా అని అంతా ఆలోచణలోపడ్డారు. ఎందుకంటే అనిరుధ్ విజయ పరంపర అందరికి తెలిసిందే. అంతే కాదు    ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమా హిట్టు కొట్టడమే  కాకుండా అభిమానులను ఉర్రూతలూగిస్తుంటుంది.  ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయ. రెండు భాగాలుగా రానున్న ఈ పాన్‌ ఇండియా మూవీ ఫస్ట్ పార్ట్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5వ తేదన విడుదల కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్