కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిజమే...ఓపెన్ అయిన రానా

By Surya PrakashFirst Published Mar 17, 2023, 7:12 AM IST
Highlights

 కొన్నాళ్ల క్రితం కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రావడంతో చివరికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు. 


రానా దగ్గుబాటి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆ మధ్యన  విపరీతంగా వార్తలు వినిపించాయి.  యూఎస్‌ కి  రానా.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసమే వెళ్లారని అన్నారు.  రానాతో పాటు ఆయన తల్లి లక్ష్మి, చెల్లెలు మాళవిక యూఎస్‌లోనే ఉన్నారని చెప్పారు. కుమారుడికి కిడ్నీ దానం చేయడానికి లక్ష్మి వెళ్లారని, రానాకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని పలు వెబ్‌సైట్లు రాశాయి. అయితే అప్పుడు అందులో ఎంతవరకూ నిజం ఉందనేది ఎవరికీ అర్దం కాలేదు. ఈ విషయమై తాజాగా రానా ఓపెన్ అయ్యారు.

బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి ఇటీవలే రానా నాయుడుతో OTT అరంగేట్రం చేశాడు.  ఈ ఓటిటి క్రైమ్ డ్రామాలో అతని నిజ జీవిత బాబాయ్ వెంకటేష్ దగ్గుబాటి తో కలిసి చేసారు. ఈ షో ప్రమోషన్ కు సంబంధించిన ప్రచార ఇంటర్వ్యూలలో, రానా తన ఆరోగ్య విషయాలు గురించి మాట్లాడారు. తాను పాక్షిక అంధత్వంతో బాధపడుతున్న దాని గురించి మరియు తన కిడ్నీ మార్పిడి గురించి కూడా ఓపెన్ అయ్యారు.

ది బాంబే జర్నీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రానా దగ్గుబాటి తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పారు. కార్నియల్ మరియు కిడ్నీ అనే రెండు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ల ద్వారా తాను 'టెర్మినేటర్'లా భావిస్తున్నానని కూడా   చెప్పాడు. 
  
 రానా మాట్లాడుతూ.. గతంలో తాను కన్ను, కిడ్నీ ఆపరేషన్ లు చేయించుకున్నానని చెప్పారు. చిన్ననాటి నుంచి కుడి కన్ను నుంచి చూడలేనని, అందుకే కుడి కన్నుకు ఆపరేషన్ చేశారని చెప్పారు. కొన్నాళ్ల క్రితం కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రావడంతో చివరికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు. చాలా మంది శారీరక సమస్యల కారణంగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారని, ఆ సమస్య పరిష్కరించినప్పటికీ కొంత బాధ మాత్రం అలాగే ఉంటుందని చెప్పారు. అయితే ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తాను ధైర్యంగా ఉన్నానని అదే ఇప్పటి వరకూ తనను కాపాడిందని అన్నారు. 

 జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా పౌజ్ బటన్ నొక్కితే ఎలా ఉంటుంది, తన లైఫ్ లో కూడా అలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. తనకు చిన్పప్పటి నుంచీ బీపీ ఉందని, దీంతో గుండె సంబంధిత సమస్య కూడా వచ్చిందని అన్నారు. ఈ క్రమంలో కొంత వయసు వచ్చిన తర్వాత కిడ్నీలు కూడా పాడయ్యాయని అన్నారు. డాక్టర్లు పరీక్షలు చేసి వీలైనంత త్వరగా వైద్యం చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారని చెప్పారు. అయితే మొదట్లో కొన్ని మందులతో ఆ సమస్య తగ్గుతుందేమో అనుకున్నారని, కానీ అది జరగలేదన్నారు. చివరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. వైద్యం చేయించుకుంటున్న సమయంలో తన కుటుంబాన్ని చూస్తే చాలా బాధగా అనిపించేదని చెప్పారు రానా. తర్వాత కొన్ని నెలలు పాటు వైద్యం చేయించుకొని తిరిగి వచ్చానని చెప్పారు.  

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది అమెరికన్ డ్రామా సిరీస్ అయిన ‘రే డొనోవన్’ ఆధారంగా తెరకెక్కింది. దీనికి కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు.
 

click me!