Rana with RRR: రామ్‌, భీమ్‌లతో భళ్లాలదేవ.. ఫోటో అదిరిపోయిందిగా.. వైరల్

Published : Dec 22, 2021, 04:33 PM IST
Rana with RRR: రామ్‌, భీమ్‌లతో భళ్లాలదేవ.. ఫోటో అదిరిపోయిందిగా.. వైరల్

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌,రాజమౌళి ముంబయిలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని భళ్లాలదేవ(బాహుబలిలో పాత్ర)రానా కలిశాడు. ఈ నలుగురు కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. 

అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌లను.. భళ్లాల దేవ కలిస్తే, అదొక విజువల్‌ ఫీస్ట్ అని చెప్పొచ్చు. వారిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. తాజాగా అలాంటి అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అందుకు ముంబయి వేదికైంది. ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌,రాజమౌళి ముంబయిలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని భళ్లాలదేవ(బాహుబలిలో పాత్ర)రానా కలిశాడు. ఈ నలుగురు కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ముందు రాజమౌళి, ఆ తర్వాత ఎన్టీఆర్‌, తర్వాత రామ్‌చరణ్‌, చివరన రానా ఉన్నారు. ఓ స్టయిల్‌ లో ఈ నలుగురు కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్స్ ముంబయిలో సందడి చేస్తున్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, దర్శకుడు రాజమౌళి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. గత నాలుగు రోజులుగా ముంబయిలోనే ఉన్నారు. రాజమౌళి.. బాలీవుడ్‌ మార్కెట్‌పై పట్టు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అతిపెద్ద మార్కెట్‌ అయిన హిందీలో ఈ `ఆర్‌ఆర్‌ఆర్‌`తో సత్తా చాటాలని, అక్కడి నుంచే భారీగా కలెక్షన్లని రాబట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆదివారం జరిగిన `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానులను భారీగా ముంబయికి తరలించారు. దీంతో ముంబయిలో చరణ్‌, ఎన్టీఆర్‌ అభిమానులు హంగామా చేశారు. బారీకేడ్లు పగలగొట్టడం, అక్కడ గ్లాస్‌ అద్దాలు పగిలిపోవడంతో నానా రచ్చ అయ్యింది. ముంబయిలో మన హీరోలు సత్తాని చూపించేందుకు జక్కన్న గట్టి ప్లానే చేశారని చెప్పొచ్చు.  దీంతో హిందీ ఆడియెన్స్ తోపాటు, బాలీవుడ్‌ మేకర్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. వీరి ఫాలోయింగ్‌కి వాళ్లు కూడా షాక్‌కి గురైనట్టు టాక్. 

ఇక ఎన్టీఆర్‌, చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని డీవీవీ దానయ్య ఏకంగా ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదల కాబోతుంది. దాదాపు పదికిపైగా భాషల్లో సినిమా రిలీజ్‌ కాబోతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురు చేశారు `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ముంబయి పూర్తి చేసుకున్నాక కేరళ, బెంగుళూరు, చెన్నైలో ప్రమోషన్స్ చేసేందుకు ప్లాన్‌ చేశారు.  చివరికి తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్‌ చేశారని టాక్‌. 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే