బర్త్ డేకి సర్‌ప్రైజ్‌ రెడీ చేస్తున్న రానా.. ఏం ఇవ్వబోతున్నాడంటే?

Published : Dec 12, 2020, 06:55 PM ISTUpdated : Dec 12, 2020, 06:59 PM IST
బర్త్ డేకి సర్‌ప్రైజ్‌ రెడీ చేస్తున్న రానా.. ఏం ఇవ్వబోతున్నాడంటే?

సారాంశం

`విరాటపర్వం` సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌, సాయిపల్లవి, ప్రియమణి పాత్ర లుక్‌లు విడుదల చేశారు. త్వరలో మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడు రానా. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని తన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు.

`భళ్లాలదేవ` రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. నక్సల్‌ ప్రధానంగా సాగే లవ్‌ స్టోరీ ఇది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి, నివేదా పేతురాజ్‌, ప్రియమణి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 

ఇప్పటికే `విరాటపర్వం` సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌, సాయిపల్లవి, ప్రియమణి పాత్ర లుక్‌లు విడుదల చేశారు. త్వరలో మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడు రానా. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని తన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. ఈ నెల 14న రానా బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్టు శనివారం ప్రకటించారు. 

సోమవారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు `విరాటపర్వం` చిత్రంలోని రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్‌ విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రానా ఓ నక్సల్‌ పాత్రలో కనిపించనున్నట్టు, అలాగే ప్రేమ, తిరుగుబాటు ప్రధానంగా సినిమా సాగనుందని, పీరియాడికల్‌గా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు